పవన్ సిని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్

ఇక ప్రస్తుతం ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ప్రారంభమైన పులి చిత్రం 60 పర్శంట్ పూర్తయిందని,దాన్ని ఆపుచేద్దామనే నిర్ణయానికి వచ్చారు. ముందు పార్టీ ప్రచారం తర్వాతే సినిమా అని ఆయన తన సన్నిహితులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. క్రిస్మస్ మరుసటి రోజు నుంచి మొదలయ్యే టూరు కోసం పవన్ ఏయే అంశాలు బహిరంగ సభల్లో ప్రస్తావించాలి...అనే వాటిపై కాన్సర్ టేట్ చేస్తున్నారు. మొదట్లో పిభ్రవరి నుంచి ఈ పర్యటన ప్రారంభించే యోచనలో ఉన్నారు.
అయితే ప్రజారాజ్యంకి బయిట మొదట ఉన్న ఊపు లేదని వినిపిస్తూండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. రాజకీయాలు ప్రక్కన పెడితే ఇలా ఐదు నెలలు గ్యాప్ తీసుకుంటే పులి ఎప్పుడు పూర్తవుతుంది...తర్వాత సినిమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి..రిలీజ్ అయ్యే సరికి ఎంత లేటవతుందనేది చర్చగా మారింది. ఏదైమైనా సినిమా షూటింగ్ లకు అంత కాలం శెలవు పెట్టడం పవన్ సినీ అభిమానులను నిరాశ పరిచే అంశమే.


Click it and Unblock the Notifications