రొమాంటిక్ సీన్లలో తాప్సీ రెచ్చిపోయింది.. బెడ్‌రూం సన్నివేశాల్లో మెరుపు తీగలా..
పలు భాషల్లో నటించి మెప్పిస్తున్న తారల్లో తాప్సీ పన్ను ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. పాత్ర ఎలాంటిదైనా 100 శాతం కమిట్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆలరించే, ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా తాప్సీ నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం లూప్ లపేటా. ఈ చిత్రంలోని రొమాంటిక్ సీన్లు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. అయితే రొమాంటిక్ సీన్లలో తాప్సీ ఎనర్జీ, కెమిస్ట్రీ గురించి హీరో తాహిర్ రాజ్ బాసిన్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాప్సీ రొమాంటిక్ ఎనర్జీ గురించిన వివరాల్లోకి వెళితే...

లూప్ లపేటాలో రొమాంటిక్ సీన్లు
తాప్సీ ఒకసారి స్క్రిప్టును లాక్ చేసిందంటే దానికి కట్టుబడి ఉంటుంది. లూప్ లపేటా చిత్రంలో సత్య, సావి పాత్రల మధ్య హై ఎనర్జీ రొమాంటిక్ సీన్లు ఉంటాయి. ఆ సీన్లలో తాప్సీ ఎనర్జీ మాటల్లో చెప్పలేం. ముఖంపై చిరునవ్వు చెరగకుండా బెడ్‌రూం సీన్లలో నటించింది అని తాహిర్ రాజ్ బాసిన్ చెప్పారు.

గోవాలో జరిగిన షూటింగులో
గోవాలో జరిగిన షూటింగ్ షెడ్యూల్‌లో జరిగిన విషయాలు మాటల్లో చెప్పలేం. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమై ఒకరకమైన డిప్రెషన్ ఉంటే దానిని గోవా ట్రిప్ దూరం చేసింది. గోవాలో జరిగిన షూటింగులో తాప్సీతో నా కెమిస్ట్రీ బాగా పండింది అంటూ తాహిర్ రాజ్ చెప్పారు.

గాలిలో తాప్సీతో ముద్దు సీన్లు
లూప్ లపేటా చిత్రంలో ఓ ముద్దు సన్నివేశం ఉంటుంది. ఆ సీన్‌ను రోప్స్ కట్టి 10 అడుగుల ఎత్తులో గాలిలో చిత్రీకరించారు. దాదాపు అది యాక్షన్ సీన్‌ను మరిపించేలా ఉంటుంది. దానిని కిస్ స్టంట్ అని దర్శకుడు కితాబిచ్చారు. గోవా బిచ్‌లో చేసిన హంగామా ఇప్పటికి నా మనసును వెంటాడుతున్నది అని తాహిర్ చెప్పారు.

తాప్సీ నటన ఎలక్ట్రీఫైయింగ్‌లా
లూప్ లపేటా చిత్రంలో చాలా రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. ఆ సీన్లలో తాప్సీ నటన ఎలక్ట్రిఫైయింగ్‌లా ఉంటాయి. చాలా నాటుగా, తెర మీద ఆడియెన్స్ ఊహించని విధంగా ఉంటాయి. అయితే సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల ఎలా రిసీవ్ చేసుకొంటారో వేచి చూడాల్సిందే అని హీరో తాహిన్ రాజ్ తన మనసులోని మాటలను చెప్పుకొన్నారు.

తాప్సీ పన్ను కెరీర్, తాజా చిత్రాలు
అందాల తార తాప్సీ పన్ను కెరీర్ విషయానికి వస్తే.. 2020లో తప్పడ్ సినిమాతో సినిమాతో ఆకట్టుకొన్నారు. ఇక 2021లో హసీన్ దిల్రూబా, జన గణ మన, రష్మీ రాకెట్, లూప్ లపేటా, దుబారా, అలాగే తమిళంలో ఇంకా పేరు పెట్టని చిత్రంలోను నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











