గబ్బర్ సింగ్‌గా, ఈగ వాహనుడిగా...గణపతి
హైదరాబాద్ : గణేశ్ నవరాత్రోత్సవాల సందర్భంగా వాడ వాడలా వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య కొలువు తీరిన విషయం తెలిసిందే. రాను రాను గణపతికి సినిమా రంగులు కూడా అద్దుతున్నారు. సినిమాల్లో ఒక క్యారెక్టర్ హిట్టయితే ఏం రేంజిలో ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. గతంలో స్పైడర్ మేన్ గణపతిని చూసాం, శంకర్ దాదా ఎంబీబీఎస్ గణపతిని చూసాం. ఈ సారి మార్కెట్లోకి గబ్బర్ సింగ్, ఈగ వినాయకుడు, ఈగ వాహనుడిగా ఉండే గణనాథులు మార్కెట్‌లోకి వచ్చాయి.
పవన్ కళ్యాణ్ అభిమానుంలంతా గబ్బర్ సింగ్ గణపతిని చూసేందుకు తరలి వస్తుండగా....ఈగ మూవీ లవర్స్, రాజమౌళి ఫ్యాన్స్ ఈగ వాహనుడిగా, ఈగ రూపంలో ఉండే గణనాథులను ఆసక్తిగా వచ్చి చూస్తున్నారు. రాను రాను గణపతిని ఇంకా ఏయే రూపాల్లో చూడాల్సి వస్తుందో....


Click it and Unblock the Notifications











