'దూకుడు' పై లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రికలో

By Srikanya

మహేష్ బాబు తాజా చిత్రం 'దూకుడు' అమెరికాలో సృష్టిస్తున్న కలెక్షన్ల ప్రభంజనం చూసి అమెరికన్ పత్రికలు సైతం విస్తుపోతున్నాయి.అక్కడి పేరుపొందిన పత్రికల్లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ - 'దూకుడు', ద బిగ్గెస్ట్ హిట్ యు హావ్ నెవర్ హార్డ్ ఆఫ్ - అంటూ ఓ వ్యాసాన్నే ప్రచురించడం అమెరికాలో తెలుగు సినిమాకి దక్కిన గుర్తింపు, గౌరవంగా భావించవచ్చు. ప్రస్తుతం హాలీవుడ్ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తున్న 'మనీబాల్', 'అబ్డక్షన్స్', 'డాల్ఫిన్స్ టేల్స్'కు దీటుగా టాలీవుడ్‌కి చెందిన 'దూకుడు' సినిమా కలెక్షన్లను సాధిస్తుండటం అమితాశ్చర్యాన్ని కలిగిస్తున్నదని ఆ పత్రిక పేర్కొంది.

ఇదివరకు అమెరికాలో ఓ తెలుగు సినిమా మూడు నెలల్లో 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం రికార్డు కాగా, ఇప్పుడు 'దూకుడు' చిత్రం కేవలం తొలి మూడు రోజుల్లోనే 1.4 మిలియన్ డాలర్లు వసూలు చేయడం అనూహ్యమని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. ఇక పెద్ద హిట్ కోసం అంతా ఎదురు చూస్తున్న తరుణంలో వచ్చిన 'దూకుడు' చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయం పరిశ్రమకి ఉత్సాహాన్ని ఇచ్చింది. సినిమాలో మహేష్ చాలా స్టైలిష్‌గా కనిపించి, సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి తన పొటెన్షియాలిటీని రుజువు చేసుకున్నాడు. ఈ యాక్షన్ సినిమాలో వినోదాన్ని అద్భుతంగా మిళితం చేసి శ్రీను వైట్ల అద్భుతంగా తీశాడని పరిశ్రమలోని పెద్దలు సైతం ఈ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X