»   » ఆ పుకార్లు నమ్మొద్దు... అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుండి ప్రకటన!

ఆ పుకార్లు నమ్మొద్దు... అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుండి ప్రకటన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: జూ ఎన్టీఆర్ హీరోగా ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ట్స్ బేనర్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ కెరీర్లో వస్తున్న ఈ 27వ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ నిర్మాత, బాబీ దర్శకుడు అనే విషయం తప్ప.... ఇంకా ఏ వివరాలు ఫైనల్ కాలేదు. అయితే బయట మాత్రం రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాక పోయినా, హీరోయిన్, నటీనటుల ఎంపిక జరుగక పోయినా..... జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

అవన్నీ పుకార్లే

దీనిపై ఎన్టీఆర్ట్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘ఎన్టీఆర్‌ 27వ చిత్రం టైటిల్‌, నటీనటుల గురించి అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి నిజం కాదు. అవి అధికారికమైతే.. మేమే స్వయంగా ప్రకటిస్తాం' అంటూ ట్వీట్ చేసింది.

ఎన్టీఆర్ 27

ఎన్టీఆర్ 27

'టెంపర్ ' , 'నాన్నకు ప్రేమతో', 'జనతా గారేజ్ ' చిత్రాలతో భారీ హ్యాట్ ట్రిక్ ను అందుకున్న ఎన్టీఆర్ మళ్ళీ బాబీ దర్శకత్వంలో వచ్చే మూవీలో సరికొత్త లుక్ తో కనిపించనున్నారు. వచ్చే సంక్రాంతి పండుగ అనంతరం చిత్రం పూజా కార్యక్రమం ఉంటుంది అని చిత్ర బృందం తెలిపింది. ఆ వెంటనే నిరవధికం గా షూటింగ్ జరుపుకుని, వచ్చే ఏడాది ద్వితీయార్ధం లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ తెలిపింది.

కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్

"సోదరుడు ఎన్టీఆర్ తో , ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై NTR27 చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందం గా ఉంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మిస్తాం. దర్శకుడు బాబీ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ లో ని స్టార్ కి , నటుడు కి న్యాయం చేసే విధం గా ఉంది. వచ్చే సంక్రాంతి సెలవుల అనంతరం చిత్రాన్ని ప్రారంభిస్తాం", అని నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు.

ఎన్టీఆర్ తో అలాంటి డైలాగు చెప్పిస్తారా? జీవిత, సెక్స్ అవసరమే కానీ

ఎన్టీఆర్ తో అలాంటి డైలాగు చెప్పిస్తారా? జీవిత, సెక్స్ అవసరమే కానీ

యంగ్‌టైగర్ ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన టెంపర్ సినిమాలో ఒక డైలాగు గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆ డైలాగు గురించి చర్చ వచ్చింది.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నీకో దండం రా బాబూ అంటూ..., ఎన్టీఆర్, హరికృష్ణ, కళ్యాణ్ రామ్ కంట తడి

నీకో దండం రా బాబూ అంటూ..., ఎన్టీఆర్, హరికృష్ణ, కళ్యాణ్ రామ్ కంట తడి

జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. నందమూరి అన్నదమ్ములు. రోడ్డు ప్రమాదంలో అన్న జానకిరామ్‌ను కోల్పోయినప్పటి నుంచి మరెవరి కుటుంబంలోనూ ఇలాంటి విషాదం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
"Lots of rumours circulating about the title as well as cast and crew of #NTR27. None of them are true.If it's official,it'll come from us." NTR arts tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu