గోపీచంద్ స్మార్ట్, హీరోయిన్ వెరీ హాట్: రాఘవేంద్రరావు
హైదరాబాద్: హీరోయిన్ల అందాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంతో, కమర్షియల్ సినిమాల్లో సరైన మోతాదులో శృంగార రసం దట్టించి ప్రేక్షకులను సమ్మోహితులను చేయడంలో తెలుగులో రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా. మరి అలాంటి రాఘవేంద్రరావు నుండి పొగడ్తలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఆదివారం జరిగిన ‘లౌక్యం' 50 రోజుల వేడుకలో పాల్గొన్నరాఘవేంద్రరావు హీరో, హీరోయిన్ దర్శకుడిగాపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘లౌక్యం' సినిమాలో గోపీచంద్ ఫస్ట్ టైం ఎంటర్టెన్మెంట్ చేసిన అదరగొట్టాడు. అదే విధంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత వెరీ హాట్. నా శిష్యులైన దర్శకుడు శ్రీవాస్, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ పనితీరు చాలా బాగుంది అన్నారు రాఘవేంద్రరావు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు.....

గోపీచంద్ మాట్లాడుతూ..
'ఈ సినిమా తెరకెక్కడానికి ప్రధాన కారకుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నేరవి. శ్రీధర్ సీపాన కథ, కోన వెంకట్, గోపీమోహన్ స్ర్కీన్ ప్లే ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. నిర్మాత ఆనందప్రసాద్ నన్ను నమ్మి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. శ్రీవాస్ చాలా లౌక్యంగా ఈ సినిమా తీశాడు'' అని తెలిపారు.

దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ...
''రాఘవేంద్రరావుగారు నాకు ఫోన్ చేసి, హీరోయిన్ ని చాలా బాగా చూపించావని ప్రశంసించారు. సినిమా విడుదలైన వెంటనే దాసరిగారు అభినందిస్తూ, మా యూనిట్ అందరికీ బొకేలు పంపించారు'' అని చెప్పారు.

కోన వెంకట్ మాట్లాడుతూ
'ఈ సినిమాతో నేను, శ్రీవాస్, శ్రీధర్ సీపాన.. ముగ్గురూ పంపిణీదారులయ్యాం. ఈ సినిమా విజయానికి టీమ్ వర్కే కారణం అన్నారు.

50 రోజుల వేడుకలో...
శ్రీధర్ సీపాన, అనూప్ రూబెన్స్, సంపత్, భరత్ రెడ్డి, ప్రగతి, కాశీ విశ్వనాథ్, పృథ్వీ, 'అదుర్స్' రఘు, గోపీమోహన్, వివేక్, రామచంద్ర, శ్యామల, అన్నేరవి, గిరి తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











