గోపీచంద్ ‘లౌక్యం’ డేట్ ఫిక్సయింది (న్యూ ఫోటోస్)
హైదరాబాద్: గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లౌక్యం' షూటింగ్ పూర్తయింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ గోపీచంద్ సరసన కథానాయికగా నటిస్తోంది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా యూనిట్ సభ్యులు ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ..‘గోపీచంద్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. స్వీట్ యాక్షన్ ఎంటర్టెనర్‌లా తీర్చి దిద్దుతున్నాం. అనూప్ రూబెన్స్ సంగీతం క్లాస్, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది' అని తెలిపారు.
నిర్మాత వి.ఆనందప్రసాద్ మాట్లాడుతూ...‘మా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ నెల 14న విజయవాడలోని లయోలా కాలేజీలో పాటలను విడుదల చేస్తాం. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మా ఆడియో వేడుక జరుగుతుంది. ఈ నెల 26న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోంది' అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, కెమెరా: వెట్రి, ఎడిటింగ్: శేఖర్.
స్లైడ్ షోలో ‘లౌక్యం' సినిమాకు సంబంధించిన న్యూ ఫోటోస్...

గోపీచంద్
ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని గోపీచంద్ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

‘లక్ష్యం' దిశగా...
గతంలో శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్లో ‘లక్ష్యం' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈచిత్రం మంచి విజయం సాధించింది. దీంతో ‘లౌక్యం'పై మంచి అంచనాలున్నాయి.

ఈ నెలలోనే రిలీజ్
ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 14 ఆడియో, 26న సినిమా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతం
ఈ మధ్య కాలంతో తెలుగులో పాపులర్ అయిన సంగీత దర్శకుల్లో అనూప్ రూబెన్స్ ఒకరు. దీంతో ఈ సినిమా ఆడియోపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

కమర్షియల్..
తెలుగులో కామెడీ, లవ్, యాక్షన్, ఫ్యామిలీ లాంటి కమర్షియల్ ఉంటేనే సినిమాలు నడుస్తున్నాయి. దీంతో ‘లౌక్యం' చిత్రంలో కమర్షియల్ అంశాలకు లోటులేకుండా దర్శకుడు జాగ్రత్త పడుతున్నాడు.


Click it and Unblock the Notifications











