అత్తారింటికి దారేది ఎనర్జీ: ‘లౌక్యం’ ఆడియో (ఫోటోస్)
విజయవాడ: గోపీచంద్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై శ్రీవాస్ దర్శకత్వంలో వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘లౌక్యం'. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం విజయవాడలో జరిగింది. ఆడియో సీడీని గోపీచంద్ ఆవిష్కరించగా, వి.ఆనంద్‌ప్రసాద్ తొలి కాపీ అందుకున్నారు. థియేటర్ ట్రైలర్లను ఆర్.నారాయణమూర్తి విడుదల చేశారు.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ- కథ వినగానే తనకు బాగా నచ్చిందని, చంద్రమోహన్, బ్రహ్మానందల జోడీ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. తొలి సన్నివేశం నుండి చివరి సన్నివేశం వరకు కామెడీతో సాగే ఈ చిత్రం విందుభోజనంలా ఉంటుందని, అందరికీ నచ్చుతుందని ఆయన తెలిపారు.
స్లైడ్ షోలో ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు, మరిన్ని వివరాలు...

కథ, కథనాలు సూపర్
మంచి కథ, కథనాలతో సాగే ఈ చిత్రంలో డైలాగులు పేలతాయని, లక్ష్యం ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత విజయవంతం అవుతుందని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు.

అత్తారింటికి దారేది చూసినపుడు
ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి మైల్ స్టోన్ అవుతుంది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా మారాను. అత్తారింటికి దారేది సినిమా చూసినప్పుడు నాకు ఏదైతే ఎనర్జీ వచ్చిందో ఈ సినిమా చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది. శ్రీధర్ సీపాన మంచి కథను అందించారు. బెస్ట్ ఆల్బమ్ అవుతుంది. సినిమా డెఫినెట్ గా చాలా పెద్ద హిట్టవుతుంది. గోపీచంద్ సౌమ్యుడు, మంచి బిహేవియర్ ఉన్న హీరో. శ్రీనివాస్ కి ఈ సినిమా పెద్ద డైరెక్టర్ గా నిలబెడుతుంది. ప్రతి ఆర్టిస్టు. టెక్నీషియన్ ఎంజాయ్ చేస్తూ చేసిన సఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది అన్నారు.

సంగీత దర్శకుడు మాట్లాడుతూ..
నిర్మాత దర్శకుడు పనితనంతో ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధిస్తుందని సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు.

చంద్రమోహన్ మాట్లాడుతూ...
50 ఏళ్ల క్రితం నేను విజయవాడ నుండి సినిమాలకు సెలక్ట్ అయ్యాను. ఇదే బెజవాడలో చదువుకున్నాను. సైకిల్ పై తిరిగాను. విజయవాడ కేపిటల్ కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో చాలా పటుత్వం ఉన్న వేశం వేసాను. ఆర్టిస్టుగా మంచి తృప్తి ఇచ్చిన సినిమా. రణంలో గోపీని, నన్ను చూసారు. అప్పటి నుండీ ఆయనతో మంచి సినిమాలు చేస్తున్నాను. ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్టవుతుంది. 100 రోజుల షీల్డ్ తీసుకుంటానని ఆశిస్తున్నాను' అన్నారు.

ఆడియో వేడుకలో...
ఎలమంచిలి రవిచంద్, వంశీ, రఘు, రఘుబాబు, చంద్రబోస్, ప్రగతి, హంసానందిని, ముకేష్ రుషి, సంపత్, కొండా మహేశ్వరరావు, గోపీమోహన్, సత్యం రాజేష్, పృధ్వీ, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











