twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుద్ది బలాన్ని నమ్ముకున్న గోపీచంద్ ‘లౌక్యం’(ప్రివ్యూ)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : గోపీచంద్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'లౌక్యం'. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనందప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా ఈ రోజు(సెప్టెంబర్ 26) గ్రాండ్ గా విడుదలవుతోంది. 'U/A' సర్టిఫికేట్ వచ్చిన ఈ చిత్రం సెన్సార్ టాక్ చాలా పాజిటివ్ గా ఉంది. ఎబోవ్ యావరేజ్ నుంచి హిట్ అయ్యేలా ఈ సినిమా ఉందని అంటున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం కామెడీ,గోపీచంద్ యాక్షన్ సినిమాకు ప్లస్ లుగా నిలుస్తాయని చెప్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర హుషారుగా సాగుతూ ఎలాంటి సమస్య అయినా బుద్ధిబలంతో పరిష్కరిస్తుంది.

    గోపీచంద్ అంటేనే యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా ‘లౌక్యం' టైటిల్‌తో తో ఫ్యామిలీ సబ్జెక్టుతో వస్తున్నాడు. భుజ బలం కంటే బుద్ధి బలాన్ని ఎక్కువగా నమ్ముకున్న యువకుడి కథ ఇది. ‘లక్ష్యం'లో గోపించంద్ కు 100మార్కులు పడ్డాయి. 'లౌక్యం'లోనూ అదే జరుగుతుంది అంటున్నాడు శ్రీవాస్. గోపీ చంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంట తెరపై చూడ ముచ్చటగా కనిపించబోతున్నారు. హంసానందిని ఐటమ్ మరో అట్రాక్షన్. పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచడమే లక్ష్యంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

    'Loukyam' movie preview

    గోపీచంద్‌ మాట్లాడుతూ ''నవ్వించడమే లక్ష్యంగా చేస్తున్న సినిమా ఇది. దర్శకుడు శ్రీవాస్‌, రచయిత శ్రీధర్‌ సీపాన కలిసి నాతో ఓ కొత్త రకమైన పాత్ర చేయిస్తున్నారు. నా ప్రయాణంలో వినోదాత్మక చిత్రాలు చాలా తక్కువ. ఇప్పుడు ఆ తరహాలో మరో చిత్రం తెరకెక్కుతుండడం ఆనందంగా ఉంది. ఇందులోని ప్రతీ సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. నేను, బ్రహ్మానందం, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కలిసి కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి'' అన్నారు. చిత్రానికి ఛాయాగ్రహణం: వెట్రి, కూర్పు: శేఖర్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

    English summary
    Loukyam movie is a romantic entertainer movie in which, Gopichand and Rakul Preet Singh are playing main lead roles along with Brahmanandam. Sriwass directing this movie under V. Anand Prasad's production banner Bhavya Creations. The famous screenplay writters Kona Venkat and Gopimohan joined with Sriwass for this mass entertainer movie. Anoop Rubens composed music for this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X