అది...రామ్ చరణ్‌కి ఊహించని షాక్ అంటన్నారు!
హైదరాబాద్: రామ్ చరణ్, కృష్ణ వంశీ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘గోవిందుడు అందరి వాడేలే'. భారీ అంచనాలతో విడుదలైన ఈచిత్రం మొదట్లో మంచి ఓపెనింగ్స్ వచ్చినట్లు కనిపించినా....బాక్సాఫీసు వద్ద లాభాలతో కూడిన వ్యాపారం చేయడంలో విఫలమైంది. ఈ చిత్రం వల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఒరిగిందేమీ లేదని ట్రేడ్ వర్గాల్లో అందరూ అంటున్నమాట. రామ్ చరణ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్నప్పటికీ సినిమా బడ్జెట్ ఎక్కువ కావడం, ఆశించిన స్థాయిలో సినిమా లేక పోవడం కూడా ఇందుకు కారణం.
‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం బాక్సాఫీసు రేసులో వెనక బడటానికి గోపీచంద్ ‘లౌక్యం' కూడా ఓ కారణమని అంటున్నారు. ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం కంటే...ఓవారం ముందుగానే గోపీచంద్ నటించిన ‘లౌక్యం' విడుదలైంది, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడంలో ‘లౌక్యం' తన ఆదిపత్యం కొనసాగించింది. దీంతో ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రానికి చిక్కులు తప్పలేదు.

అప్పటికీ ‘గోవిందుడు...' కోసం బలవంతంగా కొన్ని థియేటర్ల నుండి ‘లౌక్యం' చిత్రాన్ని లేపేసారు. అయితే ఆశించిన స్థాయిలో ‘గోవిందుడుకి' స్పందన లేక పోవడంతో......తిరిగి మళ్లీ కొన్ని థియేటర్లలో ‘లౌక్యం' సినిమా వేసారు. 50 రోజులు గడిచే సరికి ‘లౌక్యం' చిత్రం విజయవంతంగా 50 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ‘గోవిందుడు అందరి వాడలే' చిత్రం 50 రోజుల థియేటర్ల సంఖ్య 6కు మించలేదు. మొత్తానికి గోపీచంద్ ‘లౌక్యం' కారణంగా....రామ్ చరణ్ సినిమాకు ఊహించని షాక్ తగిలిందని జనాలు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











