twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లవ్ ఎఫైర్: రానా-త్రిష‌ గురించి మళ్లీ హల్ చల్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : దగ్గుబాటి యువ హీరో రాణాపై చాలా కాలంగా ఓ రూమర్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సౌతిండియా పాపులర్ హీరోయిన్ త్రిషతో రాణా డేటింగ్ చేస్తున్నాడని, వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారని ఆ రూమర్స్ సారాంశం. అయితే చాలా సందర్భాల్లో ఈ వార్తలను ఇద్దరూ యాక్టర్లు ఖండించారు.

    తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమే, మా మధ్య అంతకు మించి ఇంకేమీ లేదని స్పష్టం చేసారు. వారు ఎన్ని సార్లు తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని చెప్పినా వారిపై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అవార్డ్ ఫంక్షన్స్, క్రికెట్ మ్యాచులు, మూవీ ప్రీమియర్‌లు, ఈవెంట్స్, రెస్టారెంట్స్, పార్టీలు ఇలా ఎక్కడ పలు సందర్భాల్లో వీరు కలిసి కనిపించడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ అంటూ గాసిప్స్ గుప్పుమంటున్నాయి.

    తాజాగా ఇద్దరూ కలిసి అమెరికా వెళ్లారు. ఫెడరేషన్ ఆఫ్ తమిళ్ అసోసియేషన్ ఆప్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి త్రిషను గెస్ట్‌గా ఆహ్వానించారు. బాహుబలి షూటింగులో బ్రేక్ తీసుకుని ఖాళీగా ఉంటున్న రానా.....త్రిషతో కలిసి అక్కడికి వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందనడానికి ఈ సంఘటనే నిదర్శనమంటూ కొన్ని వెబ్ సైట్లలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

    అయితే ఇలాంటి పుకార్లు రావడానికి గతంలో పలు వీరు పలు సందర్భాల్లో కలిసి కనిపించడమే ఇందుకు కారణం. ఒక ఫోటో.....వెయ్యి రూమర్లకు కారణం కావచ్చు. కానీ వెయ్యి ఫోటోలు రూమర్‌ను నిజం అనే భ్రమను కలిగిస్తాయి. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు.

    ప్రవేట్ మూమెంట్

    ప్రవేట్ మూమెంట్


    రాణా-త్రిష చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. ఎక్కువ సేపు కలిసి గడిపారు. వీరి మధ్య స్నేహాన్ని మించిన ఇంకేదో బంధం ఉందనే చాలా మంది వాదన

    ఒకరి కోసం ఒకరు నిరీక్షణ

    ఒకరి కోసం ఒకరు నిరీక్షణ


    ఏదైనా కార్యక్రమానికి కలిసి హాజరైనప్పుడు ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయడం వెనక ఆంతర్యం ఏమిటో..?

    ఒకరికి తోడుగా ఒకరు

    ఒకరికి తోడుగా ఒకరు


    ఇటీవల జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలోనూ రాణా త్రిష వెన్నంటే ఉన్నాడు.

    తరచూ కలుసుకోవడం:

    తరచూ కలుసుకోవడం:


    ఇద్దరూ కలిసి తరచూ రెస్టారెంట్లు, హోటళ్లలో కలిసి దర్శనం ఇస్తున్నారు.

    ఫన్నీ ఫ్రెండ్స్

    ఫన్నీ ఫ్రెండ్స్


    ఇద్దరూ అనేక సందర్భాల్లో కలిసి ఫన్నీగా గడుపుతుంటారు

    క్రికెట్ మ్యాచ్

    క్రికెట్ మ్యాచ్


    ఆ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఇద్దరూ ఇలా కలిసి వీక్షించారు.

    రొమాంటిక్ కపుల్!

    రొమాంటిక్ కపుల్!


    ఒక్కోసారి వీరి ప్రవర్తన చూస్తుంటే వీరు చాలా రొమాంటిక్ అనే భావన కలుగుతుంది ఎవరికైనా...

    పార్టీలు..గట్రా

    పార్టీలు..గట్రా


    ఆ మధ్య ఒకసారి ఇద్దరూ తమ క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటూ చిక్కారు.

    అనేక సందర్భాల్లో కలిసి

    అనేక సందర్భాల్లో కలిసి


    ఓ కార్యక్రమానికి కలిసి హాజరైన త్రిష-రాణా...పక్కనే లక్ష్మి మంచు

    లవ్లీ కపుల్

    లవ్లీ కపుల్


    ఈ ఫోటో చూస్తుంటే ఇద్దరూ లవ్లీ కపులా కనిపిస్తున్నారు కదూ...

    ఎంతో సౌకర్యవంతంగా

    ఎంతో సౌకర్యవంతంగా


    ఇతరులతో కలిసున్నప్పటికంటే ఈ ఇద్దరు కలిసి కనిపించినప్పుడు ఇద్దరూ ఎంతో సౌకర్యవంతంగా ఫీలవుతున్న విషయాన్ని గమనించవచ్చు.

    ఫోటో షూట్లలోనూ..

    ఫోటో షూట్లలోనూ..


    ఇప్పటి వరకు ఇద్దరు కలిసి నటించకపోయినా, ఇద్దరూ కలిసి పలు ఫోటో షూట్లలో పాల్గొన్నారు.

    సంతోషంగా

    సంతోషంగా


    ఇద్దరూ కలిసారంటే...వారి మొహాల్లో సంతోషం తొనికిసలాడుతోంది

    ఇద్దరూ ప్రేమలో పడ్డారా

    ఇద్దరూ ప్రేమలో పడ్డారా


    ఇద్దరి ప్రవర్తన, ఆటిట్యూడ్ చూస్తుంటే ఇద్దరూ ప్రేమలో ఉన్నారా? అనే అనుమానం చూసిన వారకి కలుగక మానదు.

    మ్యూచువల్ ఫ్రెండ్స్

    మ్యూచువల్ ఫ్రెండ్స్


    రాణా-త్రిష తాము ఇద్దరం మంచి స్నేహితులమని చెప్పుకుంటారు. ఇద్దరికీ సేమ్ ఫ్రెండ్స్, సేమ్ సర్కిల్ కలిగి ఉండటం ఆసక్తికరం.

    లవ్లీ కపుల్

    లవ్లీ కపుల్


    ఇద్దరి స్నేహం వెనక ప్రేమ అనే మరో కోణం కూడా ఉందని అంటే మాత్రం ఈ ఇద్దరు అస్సలు ఒప్పుకోవడం లేదు. వీరిలో ఎవరో ఒకరి పెళ్లి అయితే కానీ ఈ రూమర్లు ఆగేలా లేవు.

    English summary
    Trisha had been invited as a special guest at the FETNA celebrations and Rana had taken a break from Baahubali shooting to join her to go to US.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X