ఆ.. అనుభవం అయ్యాకే పెళ్లి అంటున్న తార
ఆ..అనుభవం అంటే కొంపతీసి ఇంకేదో అనుకోవద్దు సమీ.. హీరోయిన్ హరిప్రియ ప్రేమ అనుభవం అయ్యాకే పెళ్లి పీటలు ఎక్కుతానంటోంది. ప్రేమించుకోవడం ద్వారా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు, ఎదుటివారి ఇష్టాలు, అభిప్రాయాలు, అభిరుచులు తెలుసుకునే వీలుంటుంది. ఇలా చేయడం ద్వారా వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందనేది నా నమ్మకం అని అంటోంది హరిప్రియ. అలా అని అరేజ్డ్ మ్యారేజెస్‌కి తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది.
ఏదైనా జీవితంలో సర్దుకు పోవడంతోనే ముడిపడి ఉంటుంది. అయితే నేను ఇంత వరకు ప్రేమలో పడలేదు. కాలేజీ లైఫ్‌లో ప్రేమించమని చాలా మంది కుర్రాళ్లు వెంటబడ్డారు. ఎవరికీ ఓకే అని చెప్పలేదు. ఎందుకంటే నాది ప్రేమించే వయసుకాదు కాబట్టి. కెరీర్‌లో స్థిరపడిన తరువాతే ప్రేమ, పెళ్ళి గురించి ఆలోచిస్తా'' అంటోంది ఈ సెక్సీ హీరోయిన్.
హరిప్రియ తెలుగులో ఇది వరకు 'తకిట తకిట" సినిమాలో నటించింది. ఆ సినిమా విజయం సాధించక పోవడంతో పెద్దగా పేరు రాలేదు. తాజా ఆమె నటించిన 'పిల్ల జమిందార్' చిత్రం విజయం సాధించడంతో మంచి ఊపుమీద ఉంది హరిప్రియ. తమిళంలో ఆమె నటించిన 'మురన్' చిత్రం కూడా ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంపై కూడా అక్కడ హిట్‌టాక్ రావడంతో ఈ ఏడాది నతకు బాగా కలిసొచ్చిందని తెగ సంబరపడుతోంది.


Click it and Unblock the Notifications











