టీవి యాంకర్ల మధ్య ప్రేమ కథ
సహ నిర్మాత శివాజీ బొడ్డేడ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చిందని, ఘన శ్యామ్ బాణీలు అందించిన ఐదు పాటలూ శ్రోతల్ని అలరిస్తుండటంతో సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడిందని చెప్పారు. అన్ని పనులూ పూర్తిచేసి ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
దర్శకుడు సంతోష్ పార్లవార్ మాట్లాడుతూ ఇదొక ముక్కోణ ప్రేమ కథా చిత్రమన్నారు. ఓ టివి చానల్‌లో పనిచేసే ఇద్దరు యాంకర్ల మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడిందని, లేడీ యాంకర్ తనతో సరదాగా మాట్లాడితే అదే ప్రేమ అనుకొని, మరో యువకుడు ఆమె వెంట పడినప్పుడు ఎలాంటి పరిణామాలు ఏర్పడ్డాయనే అంశాన్ని ఆసక్తికరంగా చిత్రీకరించినట్లు చెప్పారు.
నాలుగు ఫైట్లు మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి మాటలు: ఎకె జంపన్న, ఛాయాగ్రహణం: ఆనెం వెంకట్, కూర్పు: వినయ్ రామ్, ఫైట్స్: ప్యాంథర్ నాగరాజు, డాన్స్ ఆనంద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ పార్లవార్.


Click it and Unblock the Notifications












