twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవి యాంకర్ల మధ్య ప్రేమ కథ

    By Srinivas
    |

    సంతోష్ పార్లవార్, దిలీప్‌ కుమార్ కథానాయకులుగా, వర్షిణి నాయికగా నటిస్తున్న స్వాతి ఐ లవ్ యు చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొచ్చాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో డిటియస్ పనులు జరుగుతున్నాయి. ఎస్ఆర్‌పి క్రియేషన్స్ పతాకంపై శ్యామలా సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    సహ నిర్మాత శివాజీ బొడ్డేడ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చిందని, ఘన శ్యామ్ బాణీలు అందించిన ఐదు పాటలూ శ్రోతల్ని అలరిస్తుండటంతో సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడిందని చెప్పారు. అన్ని పనులూ పూర్తిచేసి ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

    దర్శకుడు సంతోష్ పార్లవార్ మాట్లాడుతూ ఇదొక ముక్కోణ ప్రేమ కథా చిత్రమన్నారు. ఓ టివి చానల్‌లో పనిచేసే ఇద్దరు యాంకర్ల మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడిందని, లేడీ యాంకర్ తనతో సరదాగా మాట్లాడితే అదే ప్రేమ అనుకొని, మరో యువకుడు ఆమె వెంట పడినప్పుడు ఎలాంటి పరిణామాలు ఏర్పడ్డాయనే అంశాన్ని ఆసక్తికరంగా చిత్రీకరించినట్లు చెప్పారు.

    నాలుగు ఫైట్లు మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి మాటలు: ఎకె జంపన్న, ఛాయాగ్రహణం: ఆనెం వెంకట్, కూర్పు: వినయ్‌ రామ్, ఫైట్స్: ప్యాంథర్ నాగరాజు, డాన్స్ ఆనంద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ పార్లవార్.

    English summary
    Dirctor Santhosh Parlovar said that his Swathi I Love You will release soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X