»   » ‘లవ్ చెయ్యాలా... వద్దా...’ ఫస్ట్ లుక్

‘లవ్ చెయ్యాలా... వద్దా...’ ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా' ఫేమ్ కార్తీక్‌, శ్వేతావ‌ర్మ హీరో హీరోయిన్లుగా జి.కె.సినిమాస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘లవ్ చెయ్యాలా...వద్దా...'. ఎస్.నౌషద్ ద‌ర్శ‌క‌త్వంలో జి.వి.ర‌మణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం వైజాగ్ లో జరిగింది. సోగ్గాడే చిన్నినాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

చిత్ర నిర్మాత జి.వి.ర‌మ‌ణ మాట్లాడుతూ - ''సినిమా మంచి రొమాంటిక్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌. మంచి లోకేష‌న్స్‌లో సినిమా షూటింగ్ చేశాం. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం. కార్తీక్‌, శ్వేతావర్మ చ‌క్క‌గా న‌టించారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి త్వ‌ర‌లోనే సినిమాను పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్ధం చేస్తాం'' అన్నారు. కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ - ‘'రషెష్ చూశాను. చాలా సినిమా బాగా వచ్చింది. యూనిట్ సభ్యులందరికీ అబినందనలు''అన్నారు.

Love Cheyala Vaada movie first look

ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. కార్తీక్‌, శ్వేతావ‌ర్మ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రంలో మ్యూజిక్ః గౌత‌మ్ ధ్యాని, కెమెరాః ప్ర‌వీణ్‌, ఎడిటింగ్ః ఉద్ధ‌వ్‌, నిర్మాతః జి.వి.ర‌మ‌ణ‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.నౌష‌ద్‌.

English summary
Check out Love Cheyala Vaada movie first look. Starring Karthik, Swetha Varma, directed by GV Ramana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu