మొత్తానికి ప్రేమ పాఠాలు నేర్చుకున్న రామ్ చరణ్
రామ్ చరణ్ కి నిజ జీవితంలో ప్రేమ అంటే ఏమిటీ అనేది ఇన్నాళ్ళుగా అర్దం కాలేదుట. అయితే ఆరెంజ్ చిత్రం తనకు ఆ ప్రేమ పాఠాలు నేర్పిందని మురిసిపోతున్నాడు. అతని మాటల్లోనే...నాకు అమ్మాయిలతో మాట్లాడటం అస్సలు చేతకాదు. అందులోనూ అస్సలు ప్రేమ పాఠాలు నాకు తెలవదు. ఇద్దరు ముగ్గరు ఆడ ప్రెండ్స్ ఉన్నా వారితో మగ స్నేహితులతో ఉన్నట్లే బిహేవ్ చేస్తాను. వారితో అట్లాగే మాట్లాడుతాను. అయితే ఈ సమస్యను ఆరెంజ్ చిత్రం తీర్చింది. ఆ చిత్రం చేస్తున్నప్పుడు అస్సలు ఆడవారి మనస్సులో ఏముంటుంది. వారితో ఎలా ప్రేమగా బిహేవ్ చెయ్యాలి, అమ్మాయిలు..అబ్బాయిలనుంచి ఏమి ఆశిస్తారు వంటి ఫీలింగ్స్ అన్నీ ఆరెంజ్ చిత్రం నేర్పింది అంటూ చెప్పుకొచ్చారు. ఆరెంజ్ చిత్రంలో రామ్ చరణ్ ..ప్లే బోయ్ గా నటించారు.
ఇక ఈ చిత్రం ఈ నెల 26 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం 'ఆరంజ్" టాగ్ లైన్ 'ఓ రేంజ్ లవ్ స్టోరి" కాస్తా 'లవ్ ఇన్ ఫాల్" గా మారింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా, జెనీలియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా షాజన్ పదమ్ సీ నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదల కాకముందే క్రేజ్ సృష్టిస్తోంది.


Click it and Unblock the Notifications











