దివ్య భారతి జీవితంపై ‘లవ్’
దివ్య భారతి జీవితంపై 'లవ్'90ల్లో భారతీయ వెండితెరను ఏలిన హీరోయిన్లలో దివ్య భారతి ఒకరు. అయితే ఆమె జీవితం అర్ధాంతరంగా అనుమానాస్పదంగా ముగిసింది. ఇప్పటికీ ఆమె మరణం వెనక మిస్టరీ మిస్టరీగానే ఉంది. పైకి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించినా ఆమె మరణం వెనక ఏదో బలైమన కారణ కారణం, వ్యక్తులు ఉండవచ్చనే అనుమానాలు కూడా ఇప్పటికీ అభిమానుల్లో నెలకొని ఉన్నాయి.
తాజాగా బాలీవుడ్లో రూపొందబోతున్న 'లవ్' అనే చిత్రం దివ్యభారతి జీవితాన్ని ఫోకస్ చేయనుందని తెలుస్తోంది. ఇందులో దివ్య భారతి పాత్రను ఎవరు చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. కానీ గ్రీస్ నటి టాతియానా....దివ్య భారతి కాస్ట్యూమ్ డిజైనర్ నీతాలుల్లా పాత్ర చేయనుంది.
దివ్యభారతి చివరి క్షణాల్లో నీతా లుల్లా, ఆమె భర్త ప్రొడ్యూసర్ సాజిద్ నడియావాలా ఆమె పక్కనే ఉన్నారు. తాతియానా నీతాలుల్లా పాత్రకు పర్ ఫెక్టుగా సరిపోతుందని భావిస్తున్నారు. అదే విధంగా విజె భాటియా సాజిద్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఈచిత్రంలో దివ్య భారతి మరణం వెనక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయాలను ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అసలు కారణం ఏమిటి? అనేది మాత్రం వెల్లడించే అవకాశం లేదు. 1993 ఏప్రిల్ 5న ముంబైలోని తన అపార్ట్ మెంటు వద్ద ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగా ఉంది.


Click it and Unblock the Notifications












