జయంత్ కొత్త అవతారం
'ప్రేమించుకుందాం..రా', 'ప్రేమంటే ఇదేరా' వంటి ప్రేమకథా చిత్రాలను అందించిన దర్శకుడు జయంత్ సి.పరాన్జీ విరామం తర్వాత నిర్మాతగా అవతారమెత్తి రూపొందిస్తున్న మరో ప్రేమకథా చిత్రం 'లవ్ ఫర్ ఎవర్'. 'లాఫింగ్ వాటర్స్' బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా రణదీప్, మృదుల హీరో హీరోయిన్లుగా పరిచయమౌతున్న సంగతి తెలిసిందే! ఇటీవలే 35 రోజుల పాటు న్యూజిల్యాండ్ లో జరిగిన షెడ్యూల్ తో షూటింగ్ పూర్తయింది.
బాలీవుడ్ భామ దీపిక పదుకొనే చేసిన ప్రత్యేక గీతం హైలెట్ గా వస్తున్న ఈ చిత్రం సెప్టంబరు మొదటి వారంలో ప్రేక్షకులముందుకు రాబోతోంది. ఎంతో మంది నిర్మాతలకి కాసులపంట పండించిన జయంత్ నిర్మాతగా ఏ మేరకు సఫలీకృతులవుతారో చూడాలి.
More from Filmibeat
jayanth c paranjee love for ever ranadeep mridula deepika padukone జయంత్ సి పరాన్జీ లవ్ ఫర్ ఎవర్ రణదీప్ మృదుల దీపిక పదుకొనే


Click it and Unblock the Notifications











