ఇండియా అంటే ఇష్టం.. ఇండియన్స్ అంటే ద్వేషం: పూరీ జగన్నాథ్
తాజాగా టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం తెలిసిందే.
హైదరాబాద్: తెలుగు చలనచిత్ర దర్శకుల్లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ది విలక్షణ శైలి. తన మనసుకు నచ్చిన పనులు చేయడం, చాలా ఫాస్ట్‌గా సినిమాలు నిర్మించడం, తన గురించి, తన సినిమాల గురించి ఎవరేమన్నా పట్టించుకోకపోవడం పూరీ స్టయిల్. తన సాటి దర్శకులు ఒక్క సినిమా చేసే టైమ్‌లో పూరీ మూడు సినిమాలు చేసేస్తుంటాడు.
తాజాగా టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో పూరీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో తన తర్వాతి ప్రాజెక్టు గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు పూరీ. ఆ సినిమాలో కూడా డ్రగ్స్ వ్యవహారంతోపాటు దేశాన్ని పట్టిపీడిస్తున్న ఇతర విషయాలను గురించి చర్చించనున్నట్టు తెలిపాడు.

ఆ సినిమా టైటిల్ 'జనగణమన' అంట. అంతటితో ఊరుకోకుండా 'లవ్ ఇండియా.. హేట్ ఇండియన్స్' అంటూ ఓ ట్యాగ్‌లైన్ కూడా తగిలించాడు. నిజానికి ఈ సినిమాను మహేష్‌తో తెరకెక్కించబోతున్నట్టు ఏడాది క్రితమే పూరీ జగన్నాథ్ ప్రకటించాడు. అయితే మహేష్ ఎప్పటికీ ఆ సినిమా గురించి స్పందించకపోవడంతో పక్కనపెట్టాడు.
ఎప్పటికైనా ఈ 'జనగణమన' సినిమాను తెరకెక్కించడమే తన లక్ష్యమని పూరీ జగన్నాథ్ తెలిపాడు. దేశం మీద ఎంతో ప్రేమ ఉండబట్టే అలాంటి స్క్రిప్టు తయారుచేయ గలిగానని పూరి చెప్పాడు. అంతాబాగానే ఉంది కానీ.. ఆ ట్యాగ్ లైన్ ఏంటి పూరీ? లవ్ ఇండియన్స్ వరకు బాగానే ఉంది కానీ.. ఆ తరువాతి పదమేంటి? నువ్వు మాత్రం ఇండియన్ వి కావా? మరి ఇండియన్స్ పై అంత అసహ్యమెందుకో?


Click it and Unblock the Notifications











