twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లవ్ జర్నీ విడుదల 16కు వాయిదా

    By Bojja Kumar
    |

    జర్నీ ఫేం జై, కలర్స్ స్వాతి, షాజన్ పదంసీ ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ చిత్రం 'కనిమొళి' తెలుగులో 'లవ్ జర్నీ' పేరుతో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి 9న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన నిర్మాతలు తాజాగా ఈ చిత్రానికి మార్చి 16కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు. అందనిది అందినట్లుగా డైరీలో రాసుకుంటూ తియ్యని అనుభూతికి లోనయ్యే ఓ యువకుడి ప్రేమకథలోని మలుపులను 'లవ్ జర్నీ'గా మార్చినట్లు వెల్లడించారు.

    ఈ చిత్రం గురించి గీత రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ, వెంకట్ ప్రభు దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన శ్రీపతి రంగస్వామి ఈచిత్రాన్ని ఎంతో హృద్యంగా చిత్రీకరించినట్లు, ప్రేమ కథలలో వైవిధ్యంగా ఈ చిత్రాన్ని మలిచినట్లు చెప్పుకొచ్చారు. ఇందులో నాలుగు పాటల్లో మూడింటిని తను రాయగా, మరొకటి భువన చంద్ర రాసినట్లు చెప్పుకొచ్చారు.

    ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెల కంటి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, సంగీతం: సతీష్ చక్రవర్తి, సహ నిర్మాత: మాస్టర్ ఉదయ్ తేజ, నిర్మాణ సారథ్యం: జక్కుల సుజాత, సమర్పణ: తిరుమలరెడ్డి, నిర్మాత జక్కుల నాగేశ్వరరావు, దర్శకత్వం: శ్రీపతి.

    English summary
    Jai, Colours Swathi, Shajan Padamsee starrer Love Journey release postponed to March 16.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X