సమంతకు లవ్ ప్రపోజల్.. అక్కినేని కోడలి షాకింగ్ రియాక్షన్! లవ్ సింబల్‌తో..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా, అక్కినేని కోడలిగా భారీ పాపులారిటీ సంపాదించింది సమంత. తెలుగు సినీ పరిశ్రమలో గ్లామర్ బ్యూటీగా పేరొందిన ఈమె.. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కూడా తన అందాల ఆరబోతలో వెనక్కితగ్గలేదు. దీంతో రోజురోజుకూ ఆమె అందానికి ఫిదా అయ్యే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు సోషల్ మీడియాలో లవ్ ప్రపోజల్స్ మితిమీరి వస్తున్నాయి. అయితే ఓ అభిమాని పెట్టిన లవ్ ప్రపోజల్‌పై సమంత రియాక్ట్ కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. వివరాల్లోకి పోతే..

సోషల్ మీడియాలో సమంత.. అభిమానులతో టచ్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండటం సమంత హాబీ. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలు, అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులందరికీ టచ్‌లో ఉంటుంది సామ్. అందుకే ఈమె సోషల్ మీడియా ఖాతాలకు భారీ ఫాలోయింగ్ ఉంది. సమంత అప్‌డేట్ ఏదైనా వచ్చిందంటే చాలు ఇట్టే వైరల్ అవుతుండటం మనం చూసే ఉన్నాం.
సమంతకు లవ్ ప్రపోజ్..
అభిమానులతో తరచూ ఇలా ఇంట్రాక్ట్ అయ్యే అక్కినేని కోడలికి అదే సోషల్ మీడియా వేదికగా లవ్ ప్రపోజ్‌లు చాలానే వస్తున్నాయి. అయితే వాటిని లైట్ తీసుకుంటూ వస్తున్న సమంతను తాజాగా ఓ స్టూడెంట్ పెట్టిన లవ్ ప్రపోజ్ ఆశ్చర్యపర్చింది. ఈ లవ్ ప్రపోజ్కాస్త స్పెషల్‌గా ఉండటంతో సమంత రియాక్ట్ అయ్యింది.

ప్రేమలేఖపై సమంత రిప్లై..
సమంత తాజా సినిమా ‘జాను' అప్‌డేట్స్ విపరీతంగా నచ్చేయడంతో ఓ అభిమాని ‘సామ్ ఐ లవ్ యు.. జాను ఐ లవ్ యు' అంటూ ఏకంగా 3 గంటల పాటు పుస్తకంలో ప్రేమలేఖ రాశాడు. దీన్ని వీడియో తీసి సమంతకు చేరేలా ట్విట్టర్‌లో ట్యాగ్ చేశాడు. దీంతో ఆ ప్రేమలేఖ చూసిన సమంత.. ఆ అమర ప్రేమికుడికి ఆసక్తికరంగా రిప్లై ఇచ్చేసింది.

లవ్ సింబల్‌తో థ్రిల్ చేసిన సమంత
‘హో.. ఖచ్చితంగా మీ మమ్మీ నిన్ను కోపగించుకుంటుంది.. నీ అభిమానానికి థాంక్స్.. ముందు చదువుకోమ్మా' అంటూ ఆ విద్యార్ధికి రిప్లై పెట్టి లవ్ సింబల్ ఎమోజీని షేర్ చేసింది సమంత. ఎలాగైతే నేం మనోడి ప్రేమలేఖ సమంతకు చేరడం, ఆమె దానికి స్పందించడం మాత్రం చాలా థ్రిల్లింగ్ విషయం.
Recommended Video

సూపర్ రెస్పాన్స్.. సమంత జోష్
ఇకపోతే తాజాగా సమంత తమిళ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘96' రీమేక్‌లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘జాను' పేరుతో రూపొందిస్తున్నారు. ఇందులో సమంతకు జోడీగా శర్వానంద్ నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన పోస్టర్స్, ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











