మెగా ఫ్యామిలీలో...ప్రేమ పెళ్లిళ్ళ జోరు
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో ప్రేమ పెళ్లిళ్ళ జోరు కొనసాగుతోంది. చిరంజీవి తమ్మడు పవన్ కళ్యాణ్ నటి రేణుదేశాయ్‌తో ప్రేమలో పడి ఆమెతో కొంతకాలం సహజీవనం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఆపై పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చిరు మేనల్లుడు అల్లు అర్జున్ తన స్నేహితురాలు స్నేహారెడ్డిని ప్రేమించి... పెద్దను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు.
తాజాగా చిరు తనయుడు రామ్‌చరణ్ తన స్కూల్ మేట్ ఉపాసన కామినేనితో పెళ్లికి లైన్ క్లియర్ చేసుకున్నాడు. ఊటీ స్కూల్లో చదువుతున్నప్పుడే రాంచరణ్-ఉపాసన మంచి స్నేహితులు. పైగా ఇద్దరిదీ హైదరాబాదే కావడంతో వీళ్ల స్పేహం ముదిరి ప్రేమగా మారింది. గత ఐదేళ్లుగా ఇద్దరి మధ్య కుచ్ కుచ్ హోతా హై అని మెగా కుటుంబం సన్నిహితులు చర్చించుకుంటున్నారు.
చరణ్, ఉపాసనల పెళ్లికి ఇటు మెగాస్టార్ కుటంబ సభ్యులతో పాటు....ఉపాసన కుటుంబ సభ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో నవంబర్లో నిశ్చితార్థం తంతు పూర్తి చేసి, వచ్చే ఏడాది పెళ్లి శుభకార్యం కంప్లీట్ చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు యోచిస్తున్నారు. కుల, మతాలను పక్కన పెట్టి....వ్యక్తుల అభిప్రాయాలకు, ఇష్టాలకు విలువనిస్తూ మెగా కుటుంబం పయనిస్తున్న దారిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.


Click it and Unblock the Notifications











