సెన్సార్ బోర్డ్ ఎదుట దర్శకుడి ఆత్మహత్యాయత్నం

ఈ విషయం గమనించిన కొందరు వెంటనే అతన్ని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సెన్సార్ నిమిత్తం చాలా రోజుల క్రితమే దుర్గా ప్రసాద్ తన సినిమాను బోర్డుకు పంపినట్లు తెలుస్తోంది. అయితే బోర్డు సెన్సార్ సర్టిఫికెట్ ఎన్ని రోజులైనా ఇవ్వక పోవడం, ఇవ్వడానికి అనేక అభ్యంతరాలు చెబుతుండటంతో దుర్గా ప్రసాద్ మనస్థాపానికి గురైనట్లు చర్చించుకుంటున్నారు.
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. విడుదల ఆలస్యం అవుతుండటంతో దుర్గా ప్రసాద్ తీవ్ర నష్టాల పాలయ్యాడని, ఈ క్రమంలోనే ఆత్మహత్యయత్నం చేసినట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్య యత్నం చేసినందుకు అతనిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











