Love Reddy: లవ్ రెడ్డి టీంకు షాక్.. అందరి ముందు నటుడిని చితకబాదిన మహిళ..

Love Reddy: కొన్ని సినిమాలు.. కొన్ని పాత్రలు మన మనసుకు హత్తుకునేలా.. రియాల్టీకి చాలా దగ్గరగా ఉంటాయి. కొంతమంది నటులు కూడా తను చేసే పాత్రల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు. ఆ పాత్రలో జీవిస్తారు. అలా పాత్రలో ఇన్వాల్వ్ అయి నటించడం వల్ల రియాల్టీకి చాలా దగ్గరగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు నిజంగానే జరిగాయా ? అని భ్రమలోకి వెళ్లాం. అలాంటి స‌మ‌యంలో తమకు నచ్చిన క్యారెక్టర్ కు ఏదైనా హాని జరిగితే ప్రేక్షకులు కూడా కోపంతో ర‌గిలిపోతుంటారు. అలా.. ల‌వ్ రెడ్డి(Love Reddy) మూవీలో నటించిన నటుడుపై ఓ మ‌హిళ‌ దాడి చేసింది. అసలేం జరిగిందంటే?

డైరెక్టర్ స్మరణ్ రెడ్డి దర్శకత్వంలో అంజన్ రామచంద్ర, శ్రావణి జంటగా తెరకెక్కిన సినిమా 'లవ్ రెడ్డి'. ఈ మూవీని గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు ప్రిన్స్ హ్యారీ సంగీతం అందించారు. నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. టైటిల్ తో ఆసక్తి నెలకొల్పిన లవ్ రెడ్డి సినిమా అక్టోబర్ 18న థియేటర్స్ లో విడుదలైంది.

Love Reddy movie actor NT Ramaswamy was attacked by a woman in GPR Mall Multiplex Nizampet Hyderabad

కథ ఏంటీ? .. ఈమూవీ కథ కర్ణాటక - ఆంధ్ర బోర్డర్ లోని ఓ గ్రామంలో జరుగుతుంది. నారాయణ రెడ్డి(అంజన్ రామచంద్ర) బట్టల బిజినెస్ చేస్తూ ఉంటాడు. అతనికి 30 ఏళ్ళు వచ్చినా .. నచ్చిన పిల్ల దొరకలేదు అని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. అతని తమ్ముడు(గణేష్)అన్నకి పెళ్లి అయితే గానీ.. తన పెళ్లి అవ్వదని అన్నమీద కోపంగా గణేష్. ఈ క్రమంలో నారాయణ రెడ్డి.. దివ్య(శ్రావణి)ని చూసి.. తొలి చూపులోని ప్రేమలో పడతాడు. అమ్మాయి మయలో పడి ఎవర్ని చూసిన దివ్యనే అనుకుంటాడు.

ఈ క్రమంలో ఇంట్లో వాళ్ళు ఓ పెళ్లిచూపులు తీసుకెళ్తే అక్కడ స్వీటీ(జ్యోతి)అనే అమ్మాయిలో దివ్యని చూసి ఓకే చెప్తాడు. కానీ ఆ తర్వాత ఆమె దివ్య ఫ్రెండ్ అని తెలుసుకుని ఆమెని దూరం పెడుతాడు. మెల్లగా దివ్యకు దగ్గరవుతాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో దివ్య కూడా నారాయణ రెడ్డితో క్లోజ్ గా ఉంటుంది. ఓ రోజు దివ్య నాన్న గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని, దీంతో ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి ప్రయత్నాలు చేస్తాడు.

లవ్‌ రెడ్డి సినిమా అక్టోబర్‌ 18న విడుదలైంది. పాజిటివ్‌ టాక్‌తో సినిమా నడుస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎమోషనల్ లవ్ స్టోరీ కావడంతో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. దీంతో మూవీ టీం థియేటర్లను విజిట్ చేస్తోంది. ఈ క్రమంలో మూవీ టీం కు ఊహించని పరిణామం ఎదురైంది. థియోటర్ కు వెళ్లిన 'లవ్‌ రెడ్డి' సినిమా టీంలోని నటుడు, ఈ సినిమాలో విలన్
రామస్వామిపై ఓ మహిళ దాడి చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని నిజాంపేట జీపీఆర్ మాల్ మల్టీప్లెక్స్‌లో చోటుచేసుకుంది.

లవ్ రెడ్డి సినిమా క్లైమాక్స్ చూసి భావోద్వేగానికి గురైన ఆ మహిళ .. తండ్రి పాత్రను పోషించిన నటుడు ఎన్టీ రామస్వామిపై మండిపడింది. నిజంగానే ఆ ప్రేమజంటను విడదీస్తావా అంటూ .. కోపంతో రామస్వామిని కాలర్ పట్టుకొని దూషించింది.అత‌నిపై చేయి చేసుకునింది. ఆమెని ఆపే ప్ర‌య‌త్నం చేసిన అతన్ని నానా బూతులు తిట్టింది. దీంతో లవ్‌ రెడ్డి టీం ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ క్రమంలో మూవీ టీం భయాందోళనలకు గురయ్యారు. ఎన్టీ రామస్వామి తండ్రి పాత్రలో నటించాడని, అది సినిమా అని సర్దిచెప్పారు. అయితే.. ఇది రియాలా.. లేదా సినిమా మీద హైప్ క్రియేట్ చేయడానికి ఇలాంటి ప్రయోగాలు చేశారా? అనేది తెల్సింది ఉంటుంది.

More from Filmibeat

Read more about: love reddy tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X