Don't Miss!
- News Lok Sabha Election 2024 Polling LIVE Updates: అతిపెద్ద పండగకు తొలి ఘట్టం..
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామ్ చరణ్, అలియా భట్ కోసం స్పెషల్ ప్లాన్ సెట్ చేసిన జక్కన్న .. స్పెషల్ డేట్ ఫిక్స్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ రాజమౌళి RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండడంతో సినిమాపై కేవలం టాలీవుడ్ లోనే కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ స్టయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ నటిస్తుండడం మరొక మేజర్ ప్లస్ పాయింట్.
నార్త్ ఇండియా మార్కెట్ దృష్ట్యా దర్శకుడు అలియా భట్ ను రామ్ చరణ్ కు జోడిగా సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె అల్లూరి సీతారామరాజు పాత్ర యొక్క సతీమణి సీత పాత్రలో కనిపించనుంది. ఆ పాత్ర ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సీత అనే పాత్రకు ఆమె ఎంతవరకు న్యాయం చేస్తుందనేది కీలకంగా మారింది. ఇక ఇటీవల RRR షూటింగ్ ని కాస్త టచ్ చేసిన అమ్మడు మళ్ళీ ముంబైకి వెళ్లిపోయింది.
అయితే రామ్ చరణ్ తో ఇంతవరకు అలియా భట్ ఒక్క సీన్ కూడా చేయలేదట. ఇక నెక్స్ట్ షెడ్యూల్ ని డిసెంబర్ 18న మొదలు పెట్టాలని దర్శకుడు ఒక ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు నుంచి కంటిన్యూగా వారం పాటు రామ్ చరణ్, అలియా భట్ కు సంబంధించిన సీన్స్ ను తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. క్యూట్ లవ్ సీన్స్ తో పాటు ఇద్దరి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉంటాయట. అలియా పాత్ర కూడా కథలో చాలా కీలకమని సమాచారం. మరి ఆ పాత్రకు ఆమె ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి.