Love Story movie Twitter Reveiw.. సాయిపల్లవి, చైతూ టాప్.. చివరి 30 నిమిషాలు అదుర్స్...అలాంటి రూమర్లు నమ్మొద్దు

కరోనావైరస్ కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన సినీ పరిశ్రమకు లవ్ స్టోరి మూవీ ఉత్తేజాన్ని కలిగించింది. చాలా కాలంగా థియేటర్లలో సరైన సినిమా రిలీజ్ కాకపోవడంతో ఓ మంచి మూవీ కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. ఇండస్ట్రీలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు లవ్ స్టోరి సినిమా తన వంతుగా కృషి చేసేందుకు ప్రయత్నించింది. సెప్టెంబర్ 24వ తేదీ థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఏలా స్పందిస్తున్నారంటే....

మిక్స్‌డ్ టాక్‌తో

మిక్స్‌డ్ టాక్‌తో

అమెరికాలో గురువారం అర్ధరాత్రి ప్రీమియర్ షోలు భారీగా మొదలయ్యాయి. ఈ సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తున్నది. ఓవరాల్‌గా మిక్సడ్ టాక్ వినిపిస్తున్నది.

చివరి 30 నిమిషాలు

సాయిపల్లవి ఈ సినిమాకు బలం, పవన్ సీహెచ్ మ్యూజిక్ హైలెట్. ఫాస్టాఫ్ బాగుంది. చివరి 30నిమిషాలు వినోదంగా ఉంది. పాటలకు చిందులేయాల్సిందే. ఈ సినిమా ఎమోషనల్‌గా బాగుంది. సెకండాఫ్ కూడా ఆకట్టుకొనేలా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు

అందరూ ఊహించినట్టుగానే

అందరూ ఊహించినట్టుగానే

లవ్ స్టోరి మూవీ అందరూ ఊహించినట్టు ఉండే డ్రామా. కొన్ని సన్నివేశాలు తప్ప అంతా రొటీన్ సీన్లే. మ్యూజిక్ అదిరిపోయింది. ఆడియెన్స్ రియాక్షన్ కాసేపు ఆగితే పూర్తిస్థాయిలో తెలుస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మ్యూజిక్ బాగుంది అంటూ

మ్యూజిక్ బాగుంది అంటూ

ఫస్టాఫ్ బాగుంది. అయితే ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు భిన్నంగా ఉంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉన్నాయి. మ్యూజిక్ చాలా బాగుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

యువ సామ్రాట్‌కు హిట్ పడినట్టే

నా స్నేహితుడు చూశాడు. బ్లాక్ బస్టర్ టాక్ ఇస్తున్నాడు. నాగచైతన్య, సాయి పల్లవి డ్యాన్స్ బాగా చేశారు. చివరి 30 నిమిషాలు అదరగొట్టింది. యువ సామ్రాట్‌కు హిట్ పడినట్టే అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

పాజిటివ్ రివ్యూ వస్తున్నాయంటూ

లవ్ స్టోరి సినిమాకు సంబంధించి పాజిటివ్ రివ్యూ వస్తున్నాయి. నాకు ఇష్టమైన నాగచైతన్య, శేఖర్ కమ్ముల, సాయిపల్లవికి మంచి విజయం దక్కుతుంది. ఈ సినిమాను అందరూ థియేటర్లలోనే చూడండి అంటూ దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు.

హృదయాన్ని తాకే సన్నివేశాలు

హృదయాన్ని తాకే సన్నివేశాలు

లవ్ స్టోరి విన్నర్. హృదయాన్ని తాకే సన్నివేశాలు, నటీనటులు ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధానంగా బలం. సాయిపల్లవి, నాగచైతన్య అదరగొట్టారు. బాక్సాఫీస్ వద్ద శేఖర్ కమ్ముల విజయయాత్ర కొనసాగిస్తున్నారు.

లవ్ స్టోరి సినిమా అమెరికాలో


లవ్ స్టోరి సినిమా అమెరికాలో ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఇటీవల కాలంలో మంచి కలెక్షన్లు సాధించిన జాతి రత్నాలు చిత్రం కలెక్షన్లను అధిగమించింది. కడపటి వార్తలు అందేసరికి 140k డాలర్లు వసూలు చేసింది.

బిగ్ స్క్రీన్‌పై పవర్‌ఫుల్

తెలుగు బిగ్ స్క్రీన్‌పై పవర్‌ఫుల్ సినిమాల్లో లవ్ స్టోరి ఒకటి. డ్రామా, స్ట్రాంగ్ ఎమోషన్స్, సాయిపల్లవి, నాగచైతన్య ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమా అత్యంత బలంగా మారాయి. అవార్డు విన్నింగ్ సినిమా. శేఖర్ కమ్ముల, ఆయన టీమ్‌కు గారికి నా కంగ్రాట్స్ అని అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేసింది.

బిగ్ స్క్రీన్‌పై ఓ మ్యాజిక్

నాకు అత్యంత ఇష్టమైన దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా లవ్ స్టోరి రిలీజైంది. థియేటర్లలోనే ఈ సినిమా చూద్దాం. బిగ్ స్క్రీన్‌పై ఓ మ్యాజిక్ చేయబోతున్నది. టీమ్ అందరికి నా విషెస్ అంటూ దర్శకుడు హను రాఘవపూడి ట్వీట్ చేశారు.

లవ్ స్టోరి బ్లాక్ బస్టర్


లవ్ స్టోరి బ్లాక్ బస్టర్. ఫస్టాఫ్ సూపర్‌గా ఉంది. సెకండాఫ్ ఎక్సలెంట్. లవ్ స్టోరి లాంటి క్లాస్ మూవీలో నాగచైతన్య మాస్ చూపించాడు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చుతుంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Recommended Video

Director Sekhar Kammula Exclusive Interview About 'Love Story' | Part 3

చైతూ కెరీర్‌లోనే బెస్ట్

లవ్ స్టోరి సినిమా ఫస్టాఫ్ బాగుంది. సినిమాలో క్యారెక్టర్లను శేఖర్ కమ్ముల పర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేశారు. లవ్ సీన్లు చాలా బాగున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో ఎవరూ టచ్ చేయని కథతో లవ్ స్టోరి రూపొందింది. చైతూ కెరీర్‌లోనే బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా సీన్లలో ఎమోషనల్ నటన‌తో ఆకట్టుకొన్నారు. ఎప్పటి మాదిరిగానే సాయి పల్లవి అదరగొట్టంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X