twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్-నయన....లవ్ లుక్ అదిరింది

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : అక్కినేని నాగార్జున, నయనతార జంటగా దశరత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ చిత్రంలో నాగార్జున-నయనతార లవ్ లుక్ నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఇది వరకు ఏ తెలుగు సినిమాలో కూడా లేని విధంగా ఈ జంట చాలా స్టైలిస్‌గా ఫారిన్ లుక్‌తో కనిపించడం ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

    ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యుల్ మొత్తం హైదరాబాద్ లో జరగనుంది. ఇందులో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. అనీల్ బండారి ఈ చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు. కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

    నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో గతంలో 'సంతోషం'చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ మళ్లీ కాంబినేషన్ అనగానే మార్కెట్లో మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. నాగార్జున కెరీర్లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈచిత్రం శాటిలైట్స్ రైట్స్ కోసం రికార్డు స్థాయిలో రూ. 6 కోట్లు చెల్లించేందుకు ప్రముఖ తెలుగు రీజనల్ ఛానల్ ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సదరు చానల్ ముందుకు వచ్చినట్లు సమాచారం.

    నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

    English summary
    After the success of the movie Sri Rama Rajyam, Akkineni Nagarjuna is once again pairing up with actress Nayantara in his upcoming movie Love Story, which is being directed by Mr Perfect fame Dasarath. Now, the makers of the movie have unleashed its first look on the internet. The posters give hint at a few romantic moments between the King and Nayan in it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X