శివాజికి లవ్ టెస్ట్!
హీరో శివాజీ నిర్మాతగా మారి 'తాజ్ మహల్" సినిమాని తెరకెక్కించాడు. త్వరలో విడుదలకు సిద్దమవుతోన్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా శివాజీ, ప్రేమికులకు, ప్రేమ సదభిప్రాయం, దురభిప్రాయం వున్నవారికీ ఓ కాంటెస్ట్ పెడుతున్నారు. ప్రేమ మీద వున్న అభిప్రాయాన్ని అది ఎలాంటిదైనా తనకు పంపిస్తే, వారికి విడుదలకు వారం రోజుల ముందే 'తాజ్ మహాల్" సినిమాని చూపిస్తానంటున్నాడు. అదీ సినిమా యూనిట్ తో కలిసి. శివాజీ తానిచ్చింది బంపర్ ఆఫర్ అని ఫీలవుతున్నా, ఈ టైపు పబ్లిసిటీ జిమ్మిక్కులకి కాలం ఎప్పుడో చెల్లిపోయిందన్నది నిర్వివాదాంశం. లవ్ మీద జనానికి శివాజీ టెస్ట్ పెట్టడం సంగెతెలా వున్నా, శివాజీకి 'తాజ్ మహాల్" నిర్మాతగా పెద్ద పరీక్షే పెట్టనుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో!
శివాజి శృతి కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం ఎమ్ ఎస్ నారాయణ sivaji shuruthi kota srinivasa rao bhramanandam nassar ms narayana


Click it and Unblock the Notifications