లవ్ యు బంగారమ్ : కిర్రెక్కించే రొమాన్స్..(ఫోటోలు)
హైదరాబాద్: త్వరలో విడుదల కాబోతున్న 'లవ్ యు బంగారమ్' మూవీ యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని స్పష్టం అవుతోంది. తాజాగా విడుదలైన ఆ చిత్రం వాల్ పోస్టర్స్ హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ చిత్రాలు యూత్ కిర్రెక్కించేలా ఉన్నాయి. 'హ్యాపీడేస్' ఫేం రాహుల్, రాజీవ్(కోటి తనయుడు), శ్రావ్య నటీనటులుగా గోవి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'లవ్ యు బంగారమ్'.
క్రియేటివ్ కమర్షియల్ మరియు మారుతి టాకీస్ సంస్థలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కె.వల్లభ, మారుతి నిర్మాతలు. కె.ఎస్.రామారావు సమర్పకులు. పముఖ సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది.
చిత్రానికి సంబంధించిన మరిన్ని పోటోలు, వివరాలు స్లైడ్ షోలో......

చిన్న సినిమాలే బెస్ట్
ఆ మధ్య జరిగిన ఆడియో వేడుకలో కే.ఎస్.రామారావు మాట్లాడుతూ.. 'దమ్ము' సినిమా ఇచ్చిన అనుభవంతో చేస్తున్నాను. చిన్న బడ్జెట్‌లో విజయవంతమైన సినిమాలు తీసి, మారుతీ భారీగా వసూళ్ళు రాబడుతున్నాడు.

పెద్ద సినిమాలను కంగారు పెట్టించాలి
మూడు దశాబ్దాల తరువాత యూత్‌ఫుల్ ఫిలిం తీయడం చాలా ఆనందంగా ఉంది. ఇకపై కూడా ఈ తరహా చిత్రాలు చేయాలనుంది. యూత్ అంతా కలిసి పెద్ద చిత్రాలను కంగారు పెట్టించాలి అన్నారు నిర్మాత.

దర్శకుడి వర్క్ బాగుంది
కోదండ రామిరెడ్డిలా గోవి డెడికేషన్‌తో వర్క్ చేశాడు. అతనికిది తొలి చిత్రమైనప్పటికీ అద్భుతంగా తెరకెక్కించాడు. సరదాగా ఉంటూనే ఎమోషన్‌తో ముగుస్తుందీ చిత్రం. మహిత్ పాటలు విన్నాక ఇళయరాజా పాటలు గుర్తొచ్చాయి.

మారుతి ఏమంటున్నారంటే
మారుతి మాట్లాడుతూ.. 'మనం ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అని కె.ఎస్.రామారావుగారు నన్ను అప్రోచ్ కావడంతో ఈ సినిమా ప్రారంభించాం. కష్టపడే వారికి నేను అవకాశాలు కల్పిస్తాను. గోవికి ఇచ్చిన అవకాశాన్ని కరెక్ట్‌గా వినియోగించుకున్నాడు. ప్రతి ఆర్టిస్ట్ నుండి బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ తీసుకున్నాడు. విజువల్స్ చూసి షాకయ్యాను. ఇచ్చిన బడ్జెట్ కంటే బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చాడు.

దర్శకుడు మాట్లాడుతూ...
దర్శకుడు గోవి మాట్లాడుతూ.. 'నా మిత్రుడి ద్వారా మారుతిగారిని కలిసి కథ చెప్పాను. 15 నిమిషాల్లో ఫైనల్ చేశారు. నా మీద నమ్మకంతో ఏ రోజు సెట్‌లో అడుగుపెట్టలేదు ఆయన. ఎడిటింగ్ రూమ్‌లోనే సినిమా చూసి హ్యాపీ ఫీలయ్యారు. మొదటి చిత్రం కె.ఎస్.రామారావుగారి బ్యానర్‌లో చేయడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.


Click it and Unblock the Notifications











