ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నెక్ట్స్ ఉగాది రిలీజ్
ఇప్పుడు పరిశ్రమలో హాట్ గా మారిన సంస్ధ ఆర్.ఆర్.మూవీ మేకర్స్. అతి తక్కువ కాలంలోనే పెద్ద హీరోలతో వలసగా సినిమాలు చేస్తూ ఈ సంవత్సరం బిజినెస్ మ్యాన్,పూల రంగడు వంటి హిట్స్ ఇచ్చిన ఈ సంస్ధ తమ తదుపరి చిత్రం విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆ చిత్రం సాయి కుమార్ కుమారుడు ఆది హీరోగా చేసిన 'లవ్‌లీ'. ఆది, శాన్వి జంటగా ఆర్.ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'లవ్‌లీ'. బి.జయ దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా హైదరాబాద్ సినీమ్యాక్స్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ- షూటింగ్, డబ్బింగ్ పూర్తిచేసుకున్న లవ్‌లీ చిత్రానికి ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతోందని, ఆర్.ఆర్ మూవీ మేకర్స్‌లో ఆరు హిట్ల తర్వాత ఏడవ హిట్‌గా 'లవ్‌లీ' చిత్రం ఉగాదికి విడుదల కానుందని, రాజేంద్రప్రసాద్ నటన హైలెట్‌గా నిలవనుందని తెలిపారు. దర్శకురాలు బి.జయ మాట్లాడుతూ...చిత్రం ప్రారంభమైనప్పటినుండి అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వుందని, సబినాఖాన్ పాట విని నృత్య దర్శకత్వం చేస్తానని కేరళ వచ్చి చేశారని తెలిపారు. ఓ పాటకు 600 షాట్స్ ఇస్తాంబుల్‌లో తీయడం సంతోషంగా వుందని, మార్చి మొదటివారంలో ఆడియోను విడుదల చేసి, ఉగాది కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆమె వివరించారు.
చిత్రం ప్రారంభంలో ఎలా నిర్మించాలని తామనుకున్నామో అదే విధంగా చిత్రం వచ్చిందని, మొత్తం 71 రోజులలో పూర్తయిందని, మార్చి 23న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా హీరో ఆది తెలిపారు. వెనె్నల కిషోర్, చిన్మయి, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: సుధాకర్‌రెడ్డి.


Click it and Unblock the Notifications











