మంచు తుఫాన్లో చిక్కుకున్న ఆది, లవ్‌లీ టీం
ప్రముఖ నటుడు సాయికుమార్ తనయుడు ఆది హీరోగా 'లవ్‌లీ' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్లో జరుగుతోంది. శీతాకాలం కావడంతో ఇక్కడ తీవ్రమైన మంచు కురుస్తోంది. బుధవారం భారీ మంచు తుఫాన్ విరుచుకుపడటంతో ఆదితో పాటు, సినిమా యూనిట్ సభ్యులంతా తుఫాన్లో ఇరుక్కున్నట్లు సమాచారం అందింది. ఇంకా పూర్తి వివరాల్లు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి యూనిట్ సభ్యులంతా సేఫ్‌గానే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వారికి ఎలాంటి ప్రమాదం జరుగకుండా టర్కీ అధికారులు కాపాడినట్లు తెలుస్తోంది.
ఆది కథానాయకుడిగా డా. రాజేంవూదవూపసాద్ ప్రధాన పాత్రలో ఆర్. ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ. రాజు ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి. జయ దర్శకురాలు. శాన్వి, చిన్మయి, ఆంచల్ నాయికలు.
గతంలో ఈ సినిమా గురించి దర్శకురాలు వివరిస్తూ...'అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రంగా 'లవ్‌లీ' రూపొందుతోంది. ఈ టర్కీ షెడ్యూల్‌తో ఆల్‌మోస్ట్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. 'లవ్‌లీ'తో ఆది పెద్ద రేంజ్ హీరో అవుతాడు. ఈ చిత్రం ద్వారా శాన్వి అనే అందమైన హీరోయిన్ ఇండస్ట్రీకి, ఆడియన్స్‌కి పరిచయం అవుతోంది. రాజేంద్రప్రసాద్‌గారు ఓ కీలకమైన క్యారెక్టర్ పోషిస్తున్నారు'' అన్నారు.


Click it and Unblock the Notifications











