దర్శకురాలిగా మారుతున్న‘లవ్‌లీ’ తార
'లవ్ లీ' చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా ప్రధాన పాత్రలో కనిపించిన చిన్మయి దర్శకత్వం వైపు అడుగులు వేస్తోంది. తొలుత సహాయ దర్శకురాలిగా మొదలు పెట్టి, తర్వాత సొంతగా దర్శకత్వం చేసే ప్లానింగులో ఉంది. ప్రస్తుతం ఈ భామ ఓ సినిమా కోసం స్క్రిప్టు రాస్తోంది. తర్వలోనే ప్రేక్షకులకు దర్శకురాలిగా పరిచయం కాబోతోంది.
తెలుగులో మహిళా దర్శకురాళ్లు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో చిన్మయి లాంటి అమ్మాయి 20ల్లో దర్శకత్వంపై ఇంట్రస్టు చూపడం ఆసక్తికర విషయమే. డల్లాస్ బేస్డ్ ఈ తెలుగమ్మాయి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన 'ఎల్‌బిడబ్ల్యు' చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో చిన్మయికి....బి. జయ దర్శకత్వంలో వచ్చిన 'లవ్ లీ' చిత్రంలో అవకాశం దక్కింది. ఇందులో వెన్నెల కిషోర్‌కు జంటగా నటించిన చిన్మయి తెలంగాణ యాసతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. సినిమాలో ఆమెకు హీరోయిన్‌తో సమానంగా మార్కులు పడ్డాయి.
చిన్మయికి తమ సినిమాల్లో అవకాశం ఇచ్చేందుకు పలువురు దర్శకులు యోచిస్తున్న నేపథ్యంలో...నటనను వదిలి దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న చిన్మయి ఏ మేరకు రాణిస్తుందో అని సినీ జనాల్లో అనుమానాలు ఉన్నప్పటికీ...ఆమె మాత్రం తను ఎంచుకున్న దారిపై చాలా కాన్ఫిడెన్స్‌గా ఉంది.


Click it and Unblock the Notifications











