బిపాసా...నువ్వేంటి? నీ నోట ఆ మాటేంటి?
బాలీవుడ్ హాట్ గర్ల్ బిపాస బసు. ఈ భామ బాలీవుడ్‌లో పాతుకు పోవడానికి, టాప్ రేంజ్ కి చేరడానికి కారణం...నిగనిగలాడే ఆవిడ అందాల ఆరబోత, సెక్సీ పెర్ఫార్మెన్స్, మత్తెక్కించే లిప్ టు లిప్ ముద్దు సీన్లలో అస్సలు సిగ్గు పడకుండా పాటిస్పేట్ చేయడం, పడక గది సన్నివేశాల్లో అలసి పోకుండా నటించడమే. ఇలాంటి భామ ఇటీవల చేసిన ఓ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తనకు ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేయడం పెద్ద కష్టం కాదు కానీ.....లిప్ టు లిప్ ముద్దు సీన్లలో నటించాలంటేనే కాస్త ఇబ్బంది పడతాను అంటూ మీడియాతో వ్యాఖ్యానించింది బిప్ప్. ఈవిడ మాట విన్న చాలా మంది పక పక నవ్వేసి నువ్వేనా ఈ మాటలు అంటున్నది అంటూ ఆశ్చర్య పోతున్నారు. జాన్ అబ్రహంతో 'జిస్మ్', రణబీర్ కపూర్ తో 'బచ్నా ఎ హసీనా' సినిమాల్లో తెగ రెచ్చిపోయి హాట్ కిస్సు సీన్లు పండించిన బిపాస....కావాలనే ఇప్పుడు ముద్దు సీన్ పై నాటకాలాడుతోందని, ఇదంతా పబ్లిసిటీ స్టంటే అని చాలా మంది కొట్టి పారేస్తున్నారు.


Click it and Unblock the Notifications











