రాజ్ తరుణ్ ‘లవర్’కు ఇది పెద్ద దెబ్బే... మరింత నష్టం?
రాజ్ తరుణ్, రిద్ది కుమార్ హీరో హీరోయిన్లుగా అనీశ్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు బేనర్లో రూపొందిన 'లవర్' మూవీకి బాక్సాఫీసు వద్ద యావరేజ్ రెస్పాన్స్ వస్తోంది. పరిస్థితి అసలే ఇలా ఉంటే ఇపుడు పైరసీ రూపంలో ఈ సినిమాకు మరింత నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. 'లవర్' టోటల్ మూవీ టోరెంట్ లాంటి సైట్లలో ఫ్రీడౌన్ లోడ్ అవుతుండటం నిర్మాతలను మరింత కలవర పెడుతోంది.
చాలా కాలంగా రాజ్ తరణ్‌కు సరైన హిట్ లేదు. 'లవర్' మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తొలి రోజు ఈ మూవీ రూ. 1.50 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. వీకెండ్ గ్రాస్ రూ. 3.50 కోట్లకు మించలేదు.

ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ రూ. 7 కోట్లకు అమ్మనట్లు తెలుస్తోంది. తొలి 3 రోజుల్లో రూ. 2 కోట్లకు మించి డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు కాలేదు. రెస్పాన్స్ యావరేజ్‌గా ఉన్న నేపథ్యంలో ఫుల్ అమౌంట్ రికవరీ అవుతుందా? లేదా? అనేది ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో 'లవర్' పైరసీ వెర్షన్ ఆన్‌లైన్లో దర్శనమిస్తుండటం అటు నిర్మాతలను, ఇటు డిస్ట్రిబ్యూటర్లను కలవరపెడుతోంది. ఇలాంటి వాటిని అరికట్టేందుకు సినీ రంగానికి చెందిన పెద్దలు చర్యలు తీసుకుంటున్నా మళ్లీ మళ్లీ ఇవి పునరావృతం అవుతూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











