సల్మాన్‌ని కొట్టినోళ్లకు 2 లక్షల రివార్డు.. ఆ సినిమా ఎంత పనిచేసింది, ముదురుతున్న వివాదం!
సల్మాన్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందుతున్న లవ్ రాత్రి చిత్ర వివాదం రోజు రోజుకు ముదురుతోంది. సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత భర్త అయిన ఆయుష్ శర్మ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుస్తోంది. హిందువులు పరమ పవిత్రంగా భావించే నవరాత్రి ఉత్సవాల ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారంటూ, టైటిల్ కూడా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉందంటూ విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

సల్మాన్ ఖాన్‌ని కొట్టండి
మరో హిందూ సంస్థ అయిన హిందూ హై ఆగే సంచలన ప్రకటన చేసింది. సల్మాన్ ఖాన్ ని ఎవరైనా బహిరంగంగా కొడితే వారికి 2 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు.

సల్మాన్ సోదరి భర్త
సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ భర్త అయిన ఆయుష్ శర్మ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రం రూపొందుతోంది.

నవరాత్రి ఉత్సవాలు
నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. అందుకే టైటిల్ కూడా లవ్ రాత్రి అని పెట్టారు. హిందూ సంఘాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

తీవ్ర పరిణామాలు
అగ్ర లోని భగవాన్ థియేటర్ వద్ద నేడు కొందరు హిందూ కార్యకార్తలు ఈ చిత్ర పోస్టర్స్, సల్మాన్ ఖాన్ ఫోటోలని దగ్ధం చేశారు. సల్మాన్ ఖాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ చిత్ర విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











