»   » మూడు వివాహాలు: అతడి లైఫ్ ఆసక్తికరం, ఎలా సాధ్యమైంది?

మూడు వివాహాలు: అతడి లైఫ్ ఆసక్తికరం, ఎలా సాధ్యమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

లక్కీ అలీ, బాలీవుడ్ పాపులర్ సింగర్.....ఆయన గురించి సంగీత అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు, కానీ ఆయన భార్యల గురించి మాత్రం తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. లక్కీ అలీ వారిని పెళ్లాడిన తీరు ఆసక్తికరం.

సినీ సెలబ్రిటీ సర్కిల్‌లో రెండు మూడు వివాహాలు చేసుకోవడం సర్వ సాధారణమే. అయితే కొందరు స్టార్లు ఈ వివాహాల గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. అయితే ఈ వివాహాల గురించి మాట్లాడటానికి ఏ మాత్రం వెనకాడేవాడు కాదు లక్కీ అలీ. నిన్నటితరం బాలీవుడ్ కమెడియన్ మహమూద్ కుమారుడైన లక్కీ అలీ... సక్సెస్‌ఫుల్ సింగర్‌గా, సాంగర్ రైటర్‌గా, సినిమా, టీవీ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

సింగిల్ ఉమెన్ మెన్‌గా ఉండలేక పోయాడు

సింగిల్ ఉమెన్ మెన్‌గా ఉండలేక పోయాడు

లక్కీ అలీ జీవితంలో సంఘటనలు కొన్ని అనుకోకుండా అలీ జరిగిపోయాయి. సింగిల్ ఉమెన్ మెన్‌గా ఉండలేక పోయాడు. ప్రస్తుతం లక్కీ తన మూడో భార్య కేట్ ఎలిజబెత్‌ హాలమ్‌తో కలిసి ఉంటున్నాడు. ఆమె బ్రిటిష్ మోడల్, మాజీ మిస్‌ఇంగ్లండ్ టైటిల్ విజేత. 2009లో వీరి వివాహం జరిగింది.

బెంగుళూరులో పరిచయం

బెంగుళూరులో పరిచయం

ఒకసారి బెంగుళూరులో ఒక సినిమా షూటింగులో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పరిచయం అయిన ఐదు వారాల్లోనే చాలా క్లోజ్ అయ్యారు. అప్పుడే ఆమెకు అలీ ప్రపోజ్ చేశాడు.

అతడి కోసం మతం, పేరు మార్చుకుంది

అతడి కోసం మతం, పేరు మార్చుకుంది

లక్కీ అలీని పెళ్లాడిన తర్వాత కేట్ ఎలిజబెత్ హాలమ్... అతడి కోసం తన మతం, పేరును మార్చుకుంది. ప్రస్తుతం ఆమె పేరు ఆయేషా అలీ.

2011లో...

2011లో...

కేట్, అలీ 2011లో ఒక బాబుకు జన్మనిచ్చారు. అతడికి ధని అనే పేరు పెట్టారు. ప్రస్తుతం అలీ తన ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు.

ఎలా సాధ్యమైంది?

ఎలా సాధ్యమైంది?

సింగర్ లక్కీ అలీ.... ఒక బ్రిటిష్ మోడల్‌ను ఎలా పడగొట్టారు? ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్యర్యపోయే అభిమానులు ఎందరో...

కేట్ కంటే ముందు

కేట్ కంటే ముందు

లక్కీ అలీకి ఇంతకు ముందే రెండు వివాహాలయ్యాయి. కేట్ కంటే ముందు అతడు అనాహిత అనే పార్శీ లేడీని పెళ్లాడారు. వీరికి అప్పుడు ఇద్దరు పిల్లలు జన్మించారు. 2000లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అనాహిత తన మతం మార్చుకోవడంతో పాటు తన పేరును ఇనయా అని పెట్టుకుంది.

మొదటి పెళ్లి ఇంట్రెస్టింగ్

మొదటి పెళ్లి ఇంట్రెస్టింగ్

లక్కీ అలీ మొదటి వివాహం న్యూజిలాండ్ మోడల్ మేఘన్ జేన్‌తో జరిగింది. 1996లో అలీ రూపొందించిన ‘ఓ సనమ్' అనే వీడియో ఆల్బంలో ఆమె నటించింది. ఈ విషయం గురించి ఓ సారి లక్కీ అలీ మాట్లాడుతూ ఆమె బుధవారం ఇండియా వచ్చింది, గురువారం నేను ప్రపోజ్ చేశాను, శుక్రవారం పెళ్లి చేసుకున్నాం అని తెలిపారు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు.

English summary
Lucky Ali, most cherished singer of Bollywood needs no introduction, but his wives do. The singer has been married thrice and never shied away from accepting the same.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu