twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో, హీరోయిన్లు కావాలనుకునే వారికి శుభవార్త!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బోలెడు టాలెంట్ ఉన్నా అవకాశాల కోసం దర్శక నిర్మాతల ఇళ్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలి. అలా తిరిగినా చాన్స్ వస్తుందనే గ్యారంటీ లేదు. అయితే ఇలాంటి కష్టాలు పడనవసరం లేదు...మీలో అందం, టాలెంట్ ఉంటే చాలు అవకాశాలు మేము వెతికి పెడతాం అంటూ 'లక్కీ బ్యాంబూస్' అనే సంస్థ స్థాపించ బడింది.

    'లక్కీ బ్యాంబూస్' అనేది సౌతిండియాలో స్థాపించబడ్డ మొట్ట మొదటి టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. కిరణ్ బల్లపల్లి, సునీతా చౌదరి సంయుక్తంగా ఈ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించారు. 2013 ఆగస్టు 11న ప్రారంభమైన ఈ సంస్థ గడిచిన సంవత్స కాలంలో చాలా సినిమాలకు కాస్టింగ్ అందించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలకు కూడా క్యాస్టింగ్ అందించింది.

     Lucky Baamboos Talent Search & Management

    ఈ చిత్రం ప్రస్తుతం ఐస్ క్రీం 2, పండగ చేస్కో, అన్నిగన్ (తమిళ్), అధ్యక్ష(కన్నడ), ఇండియా పాకిస్థాన్(తమిళ్) తదితర చిత్రాలకు క్యాస్టింగ్ అందిస్తోంది. ఇంతకు ముందు జంప్ జిలానీ, మాయ, గాలిపటం చిత్రాలకు హీరోయిన్ క్యాస్టింగ్ సమకూర్చింది. మిస్ ఇండియా నుండి మిస్ ఫ్రెషర్ వరకు తమ సంస్థలో సభ్యులుగా ఉన్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

    స్టార్ హీరోయిన్లను మాత్రమే కాకుండా..టాలెంటెడ్ యంగ్ హీరోయిన్లను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఫీమేల్ క్యాస్టింగు మాత్రమే కాకుండా 'లక్కీ బ్యాంబూస్' సంస్థ మేల్ క్యాస్టింగ్ ను కూడా సపోర్టు చేస్తోంది. సంస్థలో మెంబర్స్ కావాలనుకునే టాలెంటెడ్ ఆర్టిస్టులు తమ ఫోర్ట్ ఫోలియోలను [email protected] కు మెయిల్ చేయండి.

    English summary
    Lucky Baamboos Talent Search & Management Organization invitation for new talented actors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X