twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమెది వేడి పుట్టించే పాత్ర: వైవియస్ చౌదరి

    By Srikanya
    |

    హైదరాబాద్: బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్'. సాయిధరమ్‌తేజ్, సయామిఖేర్, శ్రద్ధాదాస్ ఇందులో హీరోహీరోయిన్లు. శ్రద్ధాదాస్ పాత్ర గురించి చౌదరి వివరిస్తూ -''ఇందులో శ్రద్ధ అమెరికన్ పాప్‌స్టార్ జెన్నీగా నటిస్తున్నారు. పాప్ సంగీత ప్రపంచంలో తనకెవరూ ఎదురు రాకూడదనుకునే పాత్ర తనది. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో తనది వేడి పుట్టించే పాత్ర. ఈ చిత్రం తర్వాత శ్రద్ధాదాస్‌కు అభిమానుల ఆదరణ బాగా పెరుగుతుంది'' అన్నారు.

    అలాగే ''ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో జ్యోతిలక్ష్మి, సిల్క్‌స్మితల అప్పియరెన్స్, డాన్సులంటే నాకు ఇష్టం. ఆ రకంగా మళ్లీ జ్యోతిలక్ష్మి, హలం ఫ్యాన్ ఫీచర్స్ శ్రద్ధాదాస్‌లో కన్పించాయన్న ఫీలింగ్ ఉంది'' అని వైవీయస్ చౌదరి చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: యలమంచిలి గీత.

    .ఇందుకోసం ఆమె కాస్ట్యామ్స్ దగ్గరనుంచి అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుని,స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతూ,కిక్ బాక్సింగ్,యోగా ప్రాక్టీస్ చేస్తోంది.అలాగే వైవియస్ చౌదరి కూడా ఓ రేంజిలో శ్రద్దాదాస్ అందాలను తెరకెక్కించి,కిక్ ఇవ్వటానికి రెడీ అయ్యిపోయాడని తెలుస్తోంది.ఆమె ఈ చిత్రంలో శృంగార దేవతలా అనిపిస్తుంది అంటున్నారు.ఇక వైవియస్ చౌదరి చిత్రాలన్నిటిలోనూ హీరోయిన్ ని అందంగా చూపెడతారనే సంగతి తెలిసిందే.ఇలియానాని తెలుగు తెరకు పరిచయం చేసి,ఆమె కెరీర్ కి పునాది వేసిన చౌదరి తనకూ బ్రేక్ ఇస్తాడని శ్రద్దాదాస్ ఆశతో ఎదురచూస్తోంది.

    ఇక చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు వై.వి.యస్.చౌదరి 'రేయ్' పేరుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.కథ ప్రకారం ఫస్టాఫ్ వెస్ట్ ఇండీస్ లోనూ, సెకండాఫ్ అమెరికాలోనూ జరుగుతుంది. అందుకే ఆయా ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు. మ్యూజికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా లవ్ స్టోరీగా రూపొందుతోందని దర్శకుడు చౌదరి చెబుతున్నారు. 'షౌట్ ఫర్ సక్సెస్' అన్నది ఈ సినిమాకి ట్యాగ్ లైన్ గా పెట్టారు. శుభ్ర అయ్యప్ప కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు చౌదరి చెప్పారు. తమ 'బొమ్మరిల్లు వారి' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    YVS says, "We have been very lucky to get Shraddha Das for a character called Jenny in 'Rey'. I like the characters and dances by actors like Jyothi lakshmi and Silk Smitha. They will be remembered with Shraddha Das's character in this film. She plays a Pop star in this film and she cannot bear any competition. She craves for being called as the best in the world. She has the support of Mafia and she is also a good manipulator. The character of Sayami Kher is also very important. Both of them have done an excellent job in this film".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X