రాఖీ సావంత్‌పై కోర్టు కన్నెర్ర.. అరెస్ట్ వారెంట్ జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు
ఎప్పుడూ వివాదాల్లో తలదూర్చే బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. మహారుషి వాల్మీకిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాఖీసావంత్‌కు లూధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింద
ఎప్పుడూ వివాదాల్లో తలదూర్చే బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. మహారుషి వాల్మీకిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాఖీసావంత్‌కు లూధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

వాల్మికీపై అనుచిత వ్యాఖ్యలు
హిందూ పురాణం రామాయణాన్ని రచించిన వాల్మీకిపై రాఖీ సావంత్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అందుకు లూధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అని పోలీసులు ధ్రువీకరించారు. గతేడాది ఓ ప్రైవేటు టెలివిజన్ కార్యక్రమంలో వాల్మికీ కమ్యూనిటీపై రాఖీ అనుచిత వ్యాఖ్యలు చేసింది.

వాల్మికీ కమ్యూనిటీ ఆగ్రహం
తమ మనోభావాలను కించపరిచే విధంగా రాఖీ వ్యాఖ్యలు చేసిందనే ఆరోపణలపై కమ్యూనిటీ సభ్యులు గతంలో రాఖీపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగా ఇటీవల స్థానిక లూధియానా కోర్టు వారెంటు జారీ చేసింది.

మత మనోభావాలను..
రాఖీ సావంత్ నటిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి పోయి.. తమ మత విశ్వాసాలకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసింది. అందుకు గాను తాము ఆమెపై పోలీసులకు, కోర్టులో ఫిర్యాదు చేశాం అని కమ్యూనిటీ సభ్యుడు మీడియాకు వెల్లడించారు.

నోటీసులకు స్పందించలేదు
ఈ కేసుకు సంబంధించి రాఖీ సావంత్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దాంతో ఆగ్రహించిన కోర్టు రాఖీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లూధియానా కోర్టు వారెంట్ల జారీ నేపథ్యంలో ఇద్దరు సభ్యులతో కూడిన పోలీసుల బృందం రాఖీ సావంత్‌ను అరెస్ట్ చేయ్యడానికి ముంబై బయలుదేరి వెళ్లినట్టు సమాచారం. తదుపరి విచారణను ఏప్రిల్ 10 తేదీకి వాయిదా వేసింది.


Click it and Unblock the Notifications











