తెరపైకి కొత్త సెంటిమెంట్: ఆ మూడు సినిమాలను బట్టి చూస్తే సరిలేరు నీకెవ్వరు కూడా హిట్టే.!

By Manoj Kumar P

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోల్లో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్న వారిలో ఇతడు ముందంజలో ఉన్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే మహేశ్‌.. ఫ్యాన్స్‌ గర్వపడేలా చేస్తానని గతంలో చెప్పాడు. ఇక, అప్పటి నుంచి ప్రయోగాలకు సైతం సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేశాడు. జనవరి 11న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. దీంతో ఈ మూవీ కూడా హిట్టేనన్న టాక్ వినిపిస్తోంది.

 ఇది కూడా హిట్ అయితే తిరుగుండదు

ఇది కూడా హిట్ అయితే తిరుగుండదు

మహేశ్ బాబు ఇటీవల వరుసగా ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి హిట్ చిత్రాలను అందించాడు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ‘సరిలేరు నీకెవ్వరు' చేశాడు. ఇందులో రష్మిక హీరోయిన్‌ కాగా.. విజయశాంతి, సంగీత, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇది కూడా హిట్ అయితే మహేశ్‌ హ్యాట్రిక్ నమోదు చేస్తాడు.

 ఆ రెండింటి కలయికతో రూపొందింది

ఆ రెండింటి కలయికతో రూపొందింది

ఇందులో మహేశ్ బాబు మేజర్ అజయ్ కృష్ణగా కనిపించనున్న విషయం తెలిసిందే. దీంతో అందరూ ఈ సినిమా సీరియస్‌గా ఉంటుందని అనుకున్నారు. కానీ, ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే.. ఈ సినిమాలో అదిరిపోయే కామెడీతో పాటు బలమైన ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయని అర్థం అవుతోంది. మొత్తంగా ఈ మూవీ కామెడీ, ఎమోషన్ కలయికతో రూపొందింది.

అంచనాలు పెరగడానికి కారణం ఇవే

అంచనాలు పెరగడానికి కారణం ఇవే

సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఈ సినిమాకు పని చేసిన వారు ఒకటైతే.. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ మరో కారణం. ఈ సినిమా నుంచి ఏది విడుదలైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది. అదే సమయంలో కొన్నింటికైతే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో పలు రికార్డులు క్రియేట్ అయ్యాయి.

 తెరపైకి కొత్త సెంటిమెంట్.. జోరుగా చర్చలు

తెరపైకి కొత్త సెంటిమెంట్.. జోరుగా చర్చలు

విడుదలకు సమయం దగ్గర పడడంతో అందరూ సరిలేరు నీకెవ్వరు గురించే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే లుంగీ సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకు వచ్చారు. ఈ మూవీలో మహేశ్ బాబు ‘మైండ్ బ్లాక్' అంటూ సాగే పాటలో లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేశాడు. తాజాగా మరోసారి ఈ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయడంతో.. దీనిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ఆ మూడు సినిమాలను బట్టి చూస్తే హిట్టే

ఆ మూడు సినిమాలను బట్టి చూస్తే హిట్టే

లుంగీ సెంటిమెంట్ గురించి చర్చించుకోవడానికి కారణం ఉంది. గతంలో మహేశ్ బాబు నటించిన ‘పోకిరి', ‘భరత్ అనే నేను', ‘శ్రీమంతుడు' సినిమాల్లోనూ అతడు లుంగీ వేసుకుని డ్యాన్స్ చేసిన పాటలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో సరిలేరు నీకెవ్వరు కూడా గ్రాండ్ సక్సెస్‌ను అందుకుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X