మృణాల్‌తో హాట్ రొమాన్స్.. 'అలా చేయడాన్ని బాగా నేర్పింది.. మళ్లీ మళ్లీ చేయాలనేంతగా' : స్టార్ యాక్టర్

'సీతారామం'తో ఆడియెన్స్ మదిని దోచిన ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌. రీసెంట్ గా 'లస్ట్‌ స్టోరీస్‌ 2' వెబ్‌ సిరీస్‌తో తన బోల్డ్ యాక్టింగ్ ను బయటపెట్టి ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించింది. అయితా తాజాగా ఈ ముద్దగుమ్మ గురించి ఓ నటుడు కొన్ని కామెంట్స్ చేశాడు. మృణాల్ ద్వారా అలా ఎలా చేయాలో బాగా నేర్చుకున్నట్లు అన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వివరాళ్లోకి వెళితే..

మృణాల్‌ ఠాకూర్‌... ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఒకే ఒక్క సినిమా 'సీతారామం'తో యూత్ క్రష్ గా మారిపోయారు. దీంతో ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే 'లస్ట్ స్టోరీస్ 2' అనే బోల్డ్ వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ను పలకరించారు. ఈ సిరీస్ లో మృణాల్.. హీరో అంగద్ బేడీతో కలిసి చేసిన బోల్డ్ యాక్టింగ్, రొమాన్స్ చూసి కొంతమంది షాక్ అవుతుంటే.. మరి కొంతమంది ప్రశంసిస్తున్నారు. ధైర్యంగా ఇలాంటి పాత్ర చేసి.. తన టాలెంట్ ను నిరూపించుకుందని కూడా చెబుతున్నారు.

 Hero Angad Bedi comments on Mrunal Thakur abour her Acting in Lust Stories 2 Web Series

మళ్లీ మళ్లీ నటించాలని ఉంది.. :ఈ క్రమంలోనే తాజాగా 'లస్ట్ స్టోరీస్ 2' లో మృణాల్ తో కలిసి నటించిన హీరో అంగద్ బేడి కూడా ఆమెపై స్పందించారు. మృణాల్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె ఎంతో బ్యూటీఫుల్ లేడీ అందగత్తె అభివర్ణించారు. తనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

"నా దృష్టిలో మృణాల్‌ మంచి వ్యక్తిత్వం ఉన్న నటి. సహ నటుడిగా ఆమెతో నటించడం వల్ల.. నన్ను నేనేంటో బాగా తెలుసుకున్నాను. ఆ సిరీస్‌లో మా ఇద్దరి ఎపిసోడ్‌ అంత బాగా వచ్చిందంటే.. అందుకు కారణం మృణాల్. ఆ క్రెడిట్ అంతా ఆమెకె సొంతం. స్క్రీన్ పై మా ఇద్దరి పెయిర్ ఎంతో చూడముచ్చటగా ఉందని నా అభిప్రాయం. అందుకే ఆడియెన్స్ కూడా మా జంటను బాగా ఇష్టపడ్డారని భావిస్తున్నాను.

 Hero Angad Bedi comments on Mrunal Thakur abour her Acting in Lust Stories 2 Web Series

ఆమెతో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. అలా జరగాలని ఆశిస్తున్నాను. మృణాల్‌ తన కళ్లతోనే వాహాభావాలను పలికించగలదు. ఆమె ఓ అద్భుతమైన నటి. నిజంగా తనతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇండస్ట్రీలో ఉన్న టాలెంట్ యాక్టర్స్ తో ఆమె ఒకటి" అని మృణాల్‌ పై ప్రశంసలు కురిపించారు హీరో అంగద్‌ బేడి.

తెలుగులో రెండు సినిమాలు.. :ఇకపోతే ప్రస్తుతం మృణాల్‌ ఠాకూర్ తెలుగులో నాని 30వ సినిమాలో నటిస్తున్నారు. ఇందుకోసం ఆమె రూ. 3కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకున్నారు. దీని కోసం ఆమె రూ.3.2కోట్ల పారితోషికం అందుకున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X