'లక్స్' టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ సినిమా?
నేను 'లక్స్' అనే టైటిల్ తో ఫుల్ లెంగ్త్ మూవి చేస్తాను. కథ ఏమిటంటే ఓ పల్లెటూరు అమ్మాయి..లక్స్ సబ్బుతో తోముకుని స్నానం చేస్తే అందగత్తెని, సినిమా యాక్టర్ ని అవుతానని నమ్ముతుంది. అక్కడ మొదలైన కథ చివరకు ఆమె పెద్ద స్టార్ అయి లక్స్ కి మోడల్ గా మారటం క్లైమాక్స్ గా ఎండ్ చేస్తాను అంటూ లేటెస్ట్ గా బ్లాగ్ లో రాసుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ గా ఓ యాడ్ ఏజన్సీ వాళ్ళు వచ్చి ఆయన్నుఓ యాడ్ డైరక్ట్ చేయమని అడిగారు. అయితే నేను నిముషం, ముప్పై సెకనుల యాడ్స్ ఆలోచించలేను అంటూ కావాలంటే మీ ప్రొడక్ట్ పేరుతో సినిమా చేయగలను అని ఉదాహరణగా ఇది చెప్పుకొచ్చారు. ఈ కథ విన్న వాళ్ళు ధ్రిల్లై పోయి ఓ అద్బుతమైన ఫెంటాస్టిక్ ఫైనాన్సియల్ డీల్ ఓకే చేసారుట. తాను లక్స్ పేరుతో సినిమా చేస్తానా లేదా అన్నది ప్రక్కన పెడితే ఐడియాలకు ఉండే పవర్ అని వివరించారు.


Click it and Unblock the Notifications











