twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ లిరిసిస్ట్ చంద్రబోస్ ఇంట్లో విషాదం

    |

    తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మదనమ్మ సోమవారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా మదనమ్మ తుదిస్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె అంత్య క్రియలు స్వగ్రామమైన చల్లగిరిలో జరుగనున్నాయి.

    చంద్రబోస్ స్వగ్రామం వరంగల్ జిల్లా చిట్యాల మండల చల్లగిరి గ్రామం. నర్సయ్య, మదనమ్మ దంపతుల నలుగురు సంతానంలో చంద్రబోస్ అందరికంటే చిన్నవాడు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా, తల్లి గృహిణి. వారి మూలంగా చిన్నతనంలోనే చంద్రబాబోస్‌లో సాహిత్యబీజం పడింది.

    Lyricist Chandrabose mother passed away

    గతంలో ఓ సందర్భంలో చంద్రబోస్ మాట్లాడుతూ.. చిన్నతనంలో తన తల్లి ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు చూపించేందుకు తనను తీసుకెళ్లేదని, ఈ క్రమంలోనే తాను సాహిత్యంపై, పాటలపై ఆసక్తి పెంచుకున్నట్లు తెలిపారు. అలా జరిగి ఉండకపోతే తాను ఇపుడు ఈ రంగంలో ఉండేవాడిని కాదేమో అన్నారు.

    ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ పట్టబద్రుడైన చంద్రబోస్... దూరదర్శన్‌లో సింగర్‌గా ప్రయత్నించాడు. అయితే అది ఫలించక పోవడంతో తన స్నేహితుడి సూచన మేరకు పాటలు రాయడం వైపు టర్న్ అయ్యారు. 1995లో తొలిసారిగా 'తాజ్ మహల్' అనే చిత్రానికి పాటలు రాశారు.

    English summary
    Lyricist Chandrabose mother Madanamma passed away on monday. Madanamma died of heart attack. The funeral will be held in the evening on Monday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X