బీజేపీలో చేరిన సినీ గేయరచయిత జొన్నవిత్తుల

జొన్నవిత్తుల సినీ గేయరచయితగానే కాకుండా సుప్రసిద్ద తెలుగు కవిగా పేరుగాంచారు. ఆయన గతంలో తెలుగు అధికార భాషా సంఘం సభ్యులుగా పని చేసారు. తెలుగు సినిమాలైన నెంబర్ 1, దేవుళ్లు, శ్రీ మంజునాథ, విక్కమార్కుడు, ఒక్కడున్నాడు, యమదొంగ, సుందరకాండ, సోంబేరి, అంజనీ పుత్రుడు, శక్తి, శ్రీరామ రాజ్యం చిత్రాలతో పాటు అనేక చిత్రాలకు జొన్నవిత్తుల పాటలు రాసారు.
దీంతో పాటు ఆయన శ్రీ రామలింగేశ్వర శతకము, తెలుగు శంఖారావం అనే రచనలు చేసారు. సోంబేరి అనే చిత్రానికి జొన్న విత్తుల దర్శకత్వం కూడా వహించారు. తెలుగ బాషాభివృద్ధికి ఆయన తన వంతు కృషి చేసారు. ఆయన తాజాగా భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











