Don't Miss!
- News
ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Peddada Murthy: కొత్త ఏడాది ఆరంభంలోనే విషాదం.. స్టాలిన్, చందమామ రచయిత మృతి!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనేక మంది సినీ ప్రముఖులు తుది శ్వాస విడిచారు. మరీ ముఖ్యంగా గతేడాది డిసెంబర్ లో ముగ్గురు ప్రముఖులు మరణించడం సినీ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. కైకాల సత్యనారాయణ, చలపతి రావు, వల్లభనేని జనార్ధన్ గత నెలలో తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇక ఈ కొత్త సంవత్సరంలోనైనా ఎలాంటి విషాదాలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ 2023లోకి టాలీవుడ్ అడుగుపెట్టింది. కానీ తొలి వారంలోనే ఇంకా మూడు రోజుల్లోనే మరణం చోటుచేసుకుంది.

ప్రముఖ గేయరచయిత..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గతేడాది ఎందరో ప్రముఖులు తనువు చాలించారు. దీంతో సినీ ఇండస్ట్రీ వరుసగా విషాదంలోకి వెళ్లింది. రెబల్ స్టార్ కృష్ణం రాజు, నట శేఖర, సూపర్ స్టార్ కృష్ణలతోపాటు డిసెంబర్ లో కైకాల సత్యనారాయణ, చలపతి రావు, వల్లభనేని జనార్ధన్ కన్నుమూశారు. దీంతో చిత్ర రంగానికి లోటు ఏర్పడింది. ఆ విషాదం నుంచి కొత్త సంవత్సరంలో అంతా బాగుండాలని 2023 న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టింది తెలుగు చిత్రసీమ. అయితే అందుకు భిన్నంగా తొలివారంలోనే ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ పెద్దాడ మూర్తి (Peddada Murthy) మరణంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది.

బుధవారం అంత్యక్రియలు..
ప్రముఖ గేయ రచయిత పెద్దాడ మూర్తి అనారోగ్యం కారణంగా జనవరి 3 అంటే మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా పెద్దాడ మూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఆయన మరణంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలోకి వెళ్లింది. పెద్దాడ మూర్తి మృతి పట్ల పలువురు సినీ ప్రముకులు సంతాపం తెలియజేశారు. మంచి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన పెద్దాడ మూర్తి అంత్యక్రియలను బుధవారం నిర్వహించనున్నారు. హైదరాబాద్ రాజీవ్ నగర్ లోని స్మశాన వాటికలో అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యులు జరిపించనున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ వల్ల..
ఇక పెద్దాడ మూర్తి స్వస్థలం భీముని పట్నం. తండ్రి వీరభద్రరావు నుంచి వారసత్వంగా సాహిత్యం వైపు నడిచారు. విశాఖలో డిగ్రీ చదువుతున్న సమయంలో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం పలు పత్రికల్లో పని చేశారు. సినిమా జర్నలిస్ట్ గా ఉన్న పెద్దాడ మూర్తి సినీ ఇండస్ట్రీకి దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సహాయం వల్ల పరిచయం అయ్యారు. తమ్మారెడ్డి తెరకెక్కించిన కూతురు సినిమాలో ఓ గీతాన్ని రాసే అవకాశం ఇచ్చారు. తర్వాత పలు సీరియళ్లకు కూడా పెద్దాడ మూర్తి పాటలు రాశారు.

పెద్దాడ మూర్తి సోదరుడు కూడా..
కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాలో బుగ్గె బంగారమా అనే పాటను రాసింది పెద్దాడ మూర్తి. తర్వాత మెగాస్టార్ చిరంజీవి-త్రిష జంటగా నటించిన స్టాలిన్ సినిమాలో సిగ్గుతో ఛీ ఛీ.. అనే పాటను రాశారు. ఈ పాటలు ఆయనకు పాపులారిటీని తీసుకొచ్చాయి. అలాగే ఇడియట్, మధుమాసం, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, పౌరుడు, కౌసల్య సుప్రజ రామ తదితర చిత్రాలకు కూడా గేయ రచయితగా పనిచేశారు పెద్దాడ మూర్తి. ఇక మాటలు, పాటలు అందించిన నాగలి సినిమా విడుదల కావాల్సి ఉంది. కాగా పెద్దాడ మూర్తి సోదరుడు పీవీడీఎస్ ప్రకాష్ గతేడాది చనిపోవడం గమనార్హం.