twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వకీల్ సాబ్ చూసాక మాట్లాడుకుందాం.. ట్రోలింగ్స్ పై రామజోగయ్య శాస్త్రి కౌంటర్!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వకీల్ సాబ్ ఒకటి. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో అంచనాల స్థాయిని పెంచేస్తోంది. మొత్తానికి సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఇటీవల విడుదలైన సత్యమేవజయతే సాంగ్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే వాటిపై వచ్చిన ట్రోల్స్ పై పాట రచయిత పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చాడు.

    Recommended Video

    #SathyamevaJayathe From Vakeel Saab is out | Filmibeat telugu
    100కోట్ల బిజినెస్

    100కోట్ల బిజినెస్

    వకీల్ సాబ్ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఏడాదిపాటు వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. సినిమాపై ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక సినిమా బిజినెస్ కూడా ఈజీగా 100కోట్లు దాటేస్తుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

    మొదటి పాటతోనే భారీ క్రేజ్

    మొదటి పాటతోనే భారీ క్రేజ్

    ఇక సంగీత దర్శకుడు థమన్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాడు. మహిళల గొప్పతనం గురించి చెప్పేలా మగువ సాంగ్ ను గత ఏడాది విడుదల చేసిన విషయం తెలిసిందే. సిద్ శ్రీరామ్ పాడిన ఆ సాంగ్ యూ ట్యూబ్ లో సంచలనం రేపింది. పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే.

    రామజోగయ్య శాస్త్రి కౌంటర్

    రామజోగయ్య శాస్త్రి కౌంటర్

    ఇక రెండవ పాటను పవన్ కళ్యాణ్ నిజజీవిత శైలికి తగ్గట్లుగా కంపోజ్ చేసినట్లు కామెంట్స్ వస్తున్నాయి. సత్యమేవజయతే సాంగ్ ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది. సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక పవన్ పాలిటిక్స్ లోకి వెళ్లినప్పటి నుంచి కొంతమంది కావాలని పవన్ పై విమర్శలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు సత్యమేవజయతే పై మీమ్స్ రావడంతో పాటను రాసిన రామజోగయ్య శాస్త్రి కౌంటర్ ఇచ్చాడు.

    సినిమా చూసాక మాట్లాడుకుందాం

    సినిమా చూసాక మాట్లాడుకుందాం

    పాటను వకీల్ సాబ్ గురించి రాయమంటే.. పవన్ కళ్యాణ్ గురించి రాశారు అనే ఒక మీమ్ పై స్పందించిన రామజోగయ్య శాస్త్రి.. సినిమా చూసాక మాట్లాడుకుందాం.. సరేనా.. అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు న్నిర్మించిన విషయం తెలిసిందే.

    English summary
    The Tollywood industry has missed a lot of films due for release this year. Plans all changed at once with the corona braking at 20 to 20 speed. There are a lot of mega hero movies to be released this year. First Acharya Cinema. Megastar Chiranjeevi, the film is set to release in 2020 in a combination of fights. The shooting had to be postponed to next year as the corona arrived less than halfway through.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X