twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేకింగ్.. ప్రముఖ సినీ రచయిత ఆకస్మిక మరణం.. విషాదంలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు

    |

    ఎన్నో ఆశలతో ప్రారంభమైన 2021లో దక్షిణాది చిత్రపరిశ్రమ‌లో విషాదం నెలకొంది. ప్రముఖ పాటల రచయిత వెన్నెలకంటి తుది శ్వాస విడిచారు. తమిళ పాటలను తెలుగు పాటలు అనిపించేలా ఎంతో మధురమైన సాహిత్యాన్ని అందించిన వెన్నెలకంటి ఇకలేరు. కాసేపటి క్రితమే గుండెపోటుతో మరణించారు. ఆయన మరణ వార్తతో తమిళ, తెలుగు‌ పరిశ్రమలో విషాదచాయలు నెలకొన్నాయి. వెన్నెల కంటి మరణ వార్త తెలియగానే తెలుగు సాహిత్య, సంగీత ప్రేమికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.

    పూర్తి పేరు..

    పూర్తి పేరు..

    వెన్నెల కంటి రాజేశ్వర ప్రసాద్ అంటే ఎవ్వరూ గుర్తుకు పట్టకపోవచ్చు. కానీ వెన్నెలకంటి అంటే మాత్రం అందరూ గుర్తు పడతారు. ముఖ్యంగా తమిళ డబ్బింగ్ సినిమాలకు తెలుగు వర్షెన్ పాటలు రాయడంలో ఈయన దిట్ట. అవి అచ్చం తెలుగు పాటలే అన్నట్టుగా సాహిత్యాన్ని సమకూర్చడంలో వెన్నెలకంటి తరువాతే ఎవరైనా.

    మొదట అలా..

    మొదట అలా..

    ఎస్‌. గోపాల్‌రెడ్డి తీసిన మురళీ కృష్ణుడు(1988) మూవీతో వెన్నెలకంటి తెలుగు చిత్రసీమకు గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఈ మూవీలో ఆయన రాసిన అన్నీ పాటలు సూపర్‌ హిట్‌ అవడంతో వెన్నెలకంటికి మంచి పేరు, గుర్తింపు వచ్చింది.

    మాటల రచయితగా...

    మాటల రచయితగా...

    ఆదిత్యా 369, తీర్పు, క్రిమినల్‌, శీను, టక్కరి దొంగ, మిత్రుడు, రాజా తదితర చిత్రాలకు ఆయన రాసిన పాటలు అభిమానులను ఉర్రూతలూగించాయి. డైలాగ్‌ రైటర్‌గా పంచతంత్రం, మొనాలీసా, దశావతారం, ప్రేమ ఖైదీ వంటి తమిళ చిత్రాలకు తెలుగులో డైలాగులు రాశారు.

     కుటుంబ వివరాలు..

    కుటుంబ వివరాలు..

    ఈయన పెద్ద కుమారుడు శశాంక్‌ వెన్నెలకంటి కూడా సినీ డైలాగ్‌ రైటరే. చిన్న కుమారుడు రాకేందు మౌళి లిరిసిస్టుగా, సింగర్‌గా, నటుడిగా రాణిస్తున్నారు. అందాల రాక్షసి చిత్రంలో రాకేందు మౌళి రెండు పాటలను కూడా రాశారు.

    English summary
    Vennela kanti Passed away due to cardiac arrest
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X