రోడ్డు ప్రమాదానికి గురైన ‘వెన్నెలకంటి’
చెన్నై : ప్రముఖ సినీ గేయ, మాటల రచయిత వెన్నెలకంటి బుధవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన తన కుటుంబంతో సహా నెల్లూరు నుంచి చెన్నై వెలుతుండగా నాయుడుపేట వద్ద వెనకనుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో వెన్నెలకంటితో కుటుంబ సభ్యులు గాయపడ్డారు.
ఈ ఘటనలో వెన్నెలకంటికి స్వల్పగాయాలు కాగా, ఆయన భార్య ప్రమీలకు చెయ్యి ఫ్యాక్చర్ అయింది. వెంటనే వారిని చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోందని, ప్రమాదం ఏమీ లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వెన్నలకంటి పలు తెలుగు సినిమాలకు అద్భుతమైన పాటలను అందించారు. ముఖ్యంగా డబ్బింగ్ చిత్రాలకు పాటలు అందించడంలో దిట్ట. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వరరావు. ఇప్పటి వరకు దాదాపు వందలాది హిందీ, ఇంగ్లీష్, ఇతర భాషా చిత్రాలకు మాటలు పాటలు రాసారు.


Click it and Unblock the Notifications












