twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముగ్గురయ్యారు..ఇప్పుడీ హీరోయిన్

    By Staff
    |

    Katrina Kaif
    స్టార్ హీరోయిన్స్ ఏ సినిమాలో అన్నా కాస్త అందంగా కనపడితే మనసుపారేసుకుని ఆ తర్వాత కుంచెకు పని చెప్పే పెద్దాయన ఎమ్.ఎఫ్ హుస్సేన్. ఆయన గతంలో మాధురి దీక్షిత్,టబు,అమృతారావు లను చూసి తెగ మెచ్చుకుని,వారి అందాలు తెగ పొగిడేసి,వాటిని పెయింటింగ్స్ గా గీసేసాడు. ఇప్పుడు ఆ వంతు కత్రినా కైఫ్ కి వచ్చింది.కత్తి లాంటి ఆమె అందాలను సుభాష్ ఘయ్ తాజాగా యువరాజ్ చిత్రంలో తెరకెక్కించాడు.అయితే సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది.

    ఇక ఆ సినిమా చూసిన హుస్సేన్ వెంటనే చాలా అధ్బుతంగా ఉందని,ముఖ్యంగా కత్రినాని చూపిన తీరు అదరహో అని పొగిడాడు. దాన్ని సుభాష్ ఘయ్ సంస్ధ ముక్తా ఆర్ట్స్ వారు ప్రెస్ నోట్ గా ఈ రోజు రిలీజ్ చేసారు. అసలే ఫ్లాఫ్ లో ఉండటంతో ఈ కామెంట్ ని వారు ప్రమేషన్ కి ఉపయోగించుకో దలిచారు.ఇక హుస్సేన్ తనకి పర్శనల్ గా కత్రినాతో మీటింగ్ ఏర్పాటు చేయమని కోరాడని సమాచారం.సర్లేగాని అంతకు ముందు వారి అందాలు ఇప్పుడు పాతబడ్డాయా అని కొందరంటున్నారు. ఇక కత్రినా సంగతి ఎలా ఉన్నా...అసలే ఆవేశపరుడైన సల్లు భాయ్ ..హుస్సేన్ గారి రస హృదయాన్ని సహృదయంతో అర్ధం చేసుకుంటాడా...లేక అని అంతా అనుమానిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X