twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కలైంజ్ఞర్ మరణం: బాలయ్య, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, బన్నీ, ఇంకా స్టార్స్ సంతాపం

    By Bojja Kumar
    |

    Recommended Video

    Cine Celebrities Pays Condolences To DR.M Karunanidhi

    ప్రముఖ సినీ రచయిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ ప్రముఖులు కలైంజ్ఞర్‌ను తలుచుకున్నారు. తెలుగు స్టార్స్ మెహన్ బాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ పవన్ తదితరులు కరుణానిధి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. నాటక, సినీ రచయితగా ప్రస్థానం మొదలు పెట్టిన కరుణానిధి దక్షినాది సినీ రంగంలో తనదైన ముద్రవేశారు. తమిళంతో పాటు తెలుగు సినిమాలకు కథ, స్క్రీప్లే అందించారు. తమిళనాట రాజకీయనేతగా ఎదిగి ఐదు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 94 ఏళ్ల కరుణానిధి మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

    అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయాం: నందమూరి బాలకృష్ణ

    అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయాం: నందమూరి బాలకృష్ణ

    రాజకీయ నాయకులు కరుణానిధి మరణం రాజకీయాలకు మాత్రమే కాదు చిత్రసీమకు కూడా తీరని లోటు. నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేది. 80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది మాములు విషయం కాదు. అటువంటి రాజకీయ చరిత్ర కలిగిన మహానుభావుడు నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం.

    ఆయన లోటు తీర్చలేనిది, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

    రాజకీయ భీష్మపితామహుడ్ని కోల్పోయాం: .మోహన్ బాబు

    రాజకీయ భీష్మపితామహుడ్ని కోల్పోయాం: .మోహన్ బాబు

    దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన "నీడ, బంగారక్క" చిత్రాలకుగాను స్వర్గీయ కరుణానిధి గారి నుంచి అవార్డులు అందుకోవడం ఎప్పటికీ మరువలేను. ఆయన ఉత్తమ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు అద్భుతమైన రచయిత, వక్త. ఆయన మాటలు ఉద్వేగపరుస్తాయి. ఆయన కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆయన మరణం చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఆత్మకకు శాంతి చేకూరి, ఆయన కుటుంబానికి ఆ శిరిడి సాయినాధుని ఆశీస్సులతో మనోధైర్యం సిద్ధించాలని కోరుకొంటున్నాను.

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్

    5 సార్లు ముఖ్యమంత్రి, 6 దశాబ్దాల పొలిటికల్ కెరీర్, తమిళనాడు రాజకీయ భీష్ముడు, ద్రవిడులకు ఆరాధ్యుడు... అంటూ అల్లు అర్జున్ కరుణానిధికి సంతాపం వ్యక్తం చేశారు.

    పవన్ జనసేన పార్టీ తరుపున

    పవన్ జనసేన పార్టీ తరుపున

    కరుణానిధికి సంతాపం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరుపున ప్రకటన విడుదల చేశారు.

    సమంత అక్కినేని

    కరుణానిధి శకం ముగిసింది. ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్తానం. ఆయన్ను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు అంటూ సమంత ట్వీట్ చేశారు.

    ప్రకాష్ రాజ్ ట్వీట్

    .

    త్రిష

    .

    కొరటాల శివ

    కరుణానిధికి సంతాపం వ్యక్తం చేస్తూ దర్శకుడు కొరటాల శివ ట్వీట్.

    English summary
    Mohan Babum Balakrishna, Allu Arjun, Samantha Akkineni and many other Telugu celebs paid their respects to former Tamil Nadu chief minister M Karunanidhi, the DMK patriarch who died on Tuesday at the age of 94.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X